గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - May 04, 2020 , 01:02:03

ఆపద వేళ.. ఆపన్న హస్తాలు

ఆపద వేళ.. ఆపన్న హస్తాలు

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ /కడ్తాల్‌ : కరోనా మహమ్మారిపై నిత్యం ప్రజలకు సమాచారం అందిస్తున్న జరల్నిస్టులంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆయన పర్యటించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  పెద్దవేములోనిబావి తండా సర్పంచ్‌ శ్వేత ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, ఎంపీటీసీ రాములుగౌడ్‌, ఉప సర్పంచ్‌ స్వాతి, నాయకులు పాల్గొన్నారు.

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ తెలిపారు. కొవిడ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మండలంలోని ఆకుతోటపల్లి, గౌరారం గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, దాతలు సహకారంతో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనితావిజయ్‌, వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్‌ రజిత, ఎంపీటీసీ మంగమ్మ, అర్జున్‌రావు, సొసైటీ చైర్మన్‌ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం, నమస్తేతెలంగాణ/ ఇబ్రహీంపట్నంరూరల్‌ : కరోనాను అరికట్టడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని టీఆర్‌ఎస్‌ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందితో పాటు పేదలకు ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. రాయపోల్‌ గ్రామంలో పంచాయతీ సిబ్బందికి టీఆర్‌ఎస్‌ నాయకులు కర్నె అరవింద్‌, ఎంపీటీసీ అచ్చన శ్రీశైలం, సర్పంచ్‌ బల్వంత్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్‌  మాస్క్‌లు అందజేశారు. 

మంచాల : మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు అనిరెడ్డి శ్రీలక్ష్మీసుజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రమేశ్‌ పాల్గొన్నారు. 

మాడ్గుల : నల్లవారిపల్లి సర్పంచ్‌ పార్వతమ్మ, ఆవురుపల్లి ఎంపీటీసీ కృష్ణమ్మ, ఉపసర్పంచు వెంకటయ్య, ప్రజలకు కూరగాయలు అందజేశారు.  

కొత్తూరు: పేదలు ఇబ్బందులకు గురికాకూడదని ప్రభుత్వం రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. రేషన్‌ బియ్యం రెండో విడుత పంపిణీని ఆదివారం మండలంలోని కొడిచర్ల గ్రామంలో ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు సంతోశ్‌నాయక్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు. 

కొందుర్గు : కొందుర్గు గ్రామంలోని నాలుగో, 13వ వార్డులోని పేదలకు వైస్‌ ఎంపీపీ రాజేశ్‌ పటేల్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రాజరామేశ్వర్‌రెడ్డి, పెంటయ్య, మాణెయ్య, గోపాల్‌, చెన్నయ్య, ప్రభకర్‌, నర్సింహులు పాల్గొన్నారు.

షాబాద్‌, నమస్తే తెలంగాణ / శంకర్‌పల్లి : సంకెపల్లిగూడ, పోతుగల్‌ తండాల్లో సర్పంచ్‌ కుమ్మరి దర్శన్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఏండీ మునీర్‌ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత రేషన్‌ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.నరేష్‌కుమార్‌ మొయినాబాద్‌ మండలం అప్పాజిగూడాలో లక్ష్య సాధన ఫౌండేషన్‌ విద్యార్థులకు బియ్యం, వంట సామగ్రిని అందజేశారు.  కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు ఎం.రవీందర్‌, కళావతి టీచర్‌, శ్రీకాంత్‌, నాగేశ్‌, కరాటే అనిల్‌, ఎల్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు 

యాచారం: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ నాగయ్య అన్నారు. రంగారెడ్డి- నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని మాల్‌ చెక్‌పోస్టును ఆదివారం పరిశీలించారు. సాగర్‌ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిపేయాలని సూచించారు. అత్యవసర సమయంలో తప్ప రోడ్లపై ప్రయాణిస్తే వాహనాలు సీజ్‌చేసి, కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ మధుకుమార్‌, మెడికల్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.