గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Apr 12, 2020 , 00:24:50

మాస్కులు ధరించండి.. దూరం పాటించండి

మాస్కులు ధరించండి.. దూరం పాటించండి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని కలెక్టర్‌ పౌసుమి బసు సూచించారు. శనివారం ఆమె వికారాబాద్‌ పట్టణంలోని ఆలంపల్లి, వెంకటేశ్వర కాలనీలలో పర్యటించి లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన కాలనీల్లో ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దన్నారు. నిత్యావసర సరుకులను మున్సిపల్‌ సిబ్బందితో చేరవేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ పౌసుమి బసు శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ము ఖానికి మాస్కులు ధరించి చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. జలుబు, దగ్గు, తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే దగ్గరలోని ఆస్పత్రిని సంప్రదించాలన్నారు. వికారాబాద్‌లోని మహావీర్‌ దవాఖాన, తాండూరులోని మాతా శిశు కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్యసేవల సహాయం కోసం ఫోన్‌ 7893324555, 9440248777, 9849947266 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.