శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Apr 12, 2020 , 00:23:31

పకడ్బందీగా లాక్‌డౌన్‌

పకడ్బందీగా లాక్‌డౌన్‌

వికారాబాద్‌ జిల్లా నెట్‌వర్క్‌ : జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అన్ని మున్సిపాలిటీలతోపాటు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. మోమిన్‌పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో సర్పంచ్‌ అలివేలమ్మ గ్రామంలోని వీధుల్లో రసాయనాలను స్ప్రే చేయించారు. వికారాబాద్‌ పట్టణంలోని ఎన్‌జీవో, మల్లికార్జుననగర్‌ కాలనీలలో సేవాభారతి ట్రస్టు ఆధ్వర్యంలో 32 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వికారాబాద్‌ మండల పరిధిలోని ఎర్రవళ్లిలో ఉపసర్పంచ్‌ నజీమున్నీసా పేదలకు బియ్యం, సరుకులను అందజేయడంతోపాటు అన్నదానం చేశారు. పరిగిలో శానిటైజేషన్‌, పారిశుధ్య పనులను మున్సిపల్‌ కమిషనర్‌ తేజిరెడ్డి పర్యవేక్షించారు. కులకచర్ల మండలం మక్త వెంకటాపూర్‌లో పూణె, ముంబయి నుంచి వచ్చిన 74మందితో పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. దోమ మండలం మోత్కూర్‌ గ్రామ పంచాయ తీలో సర్పంచ్‌ కేశవులు పారిశుద్ధ్య సిబ్బందికి బూట్లు, గ్లౌజులు పంపిణీ చేశారు.