బుధవారం 03 జూన్ 2020
Rangareddy - Apr 08, 2020 , 02:25:15

మీ సేవలకు సలాం..

మీ సేవలకు సలాం..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  కరోనా వ్యాధిపై జరుగుతున్న యుద్ధంలో త మ ప్రాణాలను ఫనంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికు లు, వైద్యశాఖ సిబ్బంది అద్భుతంగా పనిచేస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిపై వరాల జల్లు కురిపించారు. వైద్య సిబ్బందితోపాటు దవాఖానలో స్వీపర్‌గా పనిచేస్తున్న వారి నుంచి డైరెక్టర్‌ వరకు ప్రజల తరపున సీఎం వారికి పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆపత్కర సమయంలో సిబ్బంది చేస్తున్న సేవ, వారి ధైర్యం గొప్పది. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి రూ.5వేలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేసేవారికి రూ.7,500, వైద్య సిబ్బందికి జీతంతోపాటు అదనంగా 10శాతం గిప్ట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల పరిధిలో 2,100మంది పారిశుద్ధ్య కార్మికులు, 15 మున్సిపాలిటీల పరిధిలో 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తున్నారు. వీరికి రూ.కోటి 65లక్షలు నజరానాగా అందనుంది.  గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. పారిశుద్ధ్య కార్మికలు రాత్రింభవళ్లు పనిచూస్తూ కరోనా వ్యాధి సోకకుం డా ప్రజలను కాపాడతున్నారన్నారు. ఇదే స్ఫూర్తి తో పనిచేయాలని ప్రభుత్వం వారిని గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పింది ప్రభుత్వం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో గ్రామాలు, పట్టణాలు అద్దంలా మారిందంటే పారిశుద్ధ్య కార్మికుల పనితీరుకు నిదర్శనం. ఈ రెండు విభాగాల సిబ్బందికి పూర్తి స్థాయి వేతనాలతో పాటుగా అదనంగా చెల్లించాలని ఆదేశించడంతో సంబంధిత వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక పరిస్థితులనూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

వైద్య సిబ్బందికి సైతం నజరానా

కరోనా మహమ్మారిని తరిమేందుకు వైద్య ఆరోగ్యశాఖ అలుపెరుగని సేవలందిస్తున వైద్య సిబ్బందికి 10శాతం నజరానాగా ప్రకటించారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య శాఖ సిబ్బందికి మార్చి నెల వేతనంలో విధించిన కోత మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించనున్నారు. కరోనా పై చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా వైద్యశాఖలోడైరెక్టర్‌ నుంచి కిందిస్థాయి స్వీపర్‌ దాకా 10 శాతం అదనంగా చెల్లించనున్నారు. జిల్లా వైద్యా ఆరోగ్యశాఖలో 970మంది పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ లబ్ధిపొందనున్నారు.logo