బుధవారం 03 జూన్ 2020
Rangareddy - Apr 07, 2020 , 00:52:10

అన్నదాతకు అండగా..

అన్నదాతకు అండగా..

  • పంటల కొనుగోలుకు సర్కారు సన్నద్ధం
  • జిల్లాలో ధాన్యం సేకరణకు  కేంద్రాలు
  • 48 మక్కల కేంద్రాలు, 9 శనగల సెంటర్ల ఏర్పాటుకు చర్యలు
  • ఇప్పటికే కొన్ని కేంద్రాలు ప్రారంభం

పరిగి, నమస్తే తెలంగాణ : రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  వరి ధాన్యం కొనుగోలుకు  కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.  ఆధ్వర్యంలో  పీఏసీఎస్‌ల ద్వారా 52, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో   ఏర్పాటు చేయనుండగా.. ఈ నెల 20 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నారు.  క్వింటాలుకు  గ్రేడ్‌ రకానికి రూ.1835, కామన్‌ రకానికి రూ.1815 మద్దతు  నిర్ణయించారు. జిల్లాలో 12,500 హెక్టార్లలో వరి పంట సాగు చేయగా, 75వేల పైచిలుకు మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ధాన్యం సేకరణకు  బస్తాలు అవసరం కాగా, ఇప్పటికే 7లక్షల బస్తాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా అధికారులు తెలిపారు.  4లక్షల బస్తాల కోసం ప్రతిపాదనలు పంపించారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ ఉండకుండా ఏఈవోలు ఆయా గ్రామాల్లో రైతులకు ముందుగా టోకెన్లు జారీ చేస్తారు. వాటి ప్రకారం ఆయా తేదీల్లో కొనుగోలు చేపడుతారు.  

శనగ, వేరుశనగ కొనుగోళ్లు ప్రారంభం

జిల్లాలో శనగ, వేరుశనగ కొనుగోలు కేంద్రాలు 9   చేయనుండగా.. పలుచోట్ల  నుంచి ప్రారంభమయ్యాయి.  3,305 హెక్టార్లలో శనగ సాగు చేపట్టగా, 4వేల మెట్రిక్‌ టన్నుల  రానుందని అధికారులు అంచనా వేశారు. శనగలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.4,875, వేరుశనగకు రూ.5,090 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేశారు. 

రెండు, మూడ్రోజుల్లో మొక్కజొన్నల కొనుగోలు 

జిల్లాలో మొక్కజొన్న పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,508 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయగా.. 9,308 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా  వీటి కొనుగోలుకు జిల్లాలో   ఏర్పాటు చేయనుండగా.. రెండు,  ప్రారంభించేందుకు మార్క్‌ఫెడ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కజొన్న క్వింటాలుకు రూ.1760 ధర రైతులకు చెల్లించనున్నారు.


logo