బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Apr 05, 2020 , 00:24:59

నిర్మానుష్యంగా రోడ్లు..

నిర్మానుష్యంగా రోడ్లు..

  • నిర్మానుష్యంగా రోడ్లు..
  • కొనసాగుతున్న రేషన్‌ బియ్యం పంపిణీ
  • నిత్యావసర సరుకులు అందజేత
  • పలు చోట్ల అన్నదానాలు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : నియోజక వర్గంలో  లాక్‌డౌన్‌ సంపూర్ణంగా కొనసాగింది. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హైపోక్లోరైట్‌ ద్రావాణాన్ని పిచికారీ చేశారు. ధారూ రు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వారంతపు సంతను ఎంపీడీవో అమృత, సర్పంచ్‌ చంద్రమౌళి, ఉపసర్పంచ్‌ రాజేశ్వర్‌  సందర్శించారు. ధన్నారం కాలనీ, మండల పరిధిలోని సిద్దులూ రు, పులుసుమామిడి, పీరంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పర్యటించారు. సిద్దులూరులో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ టేకులపల్లిలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బండ విష్ణువర్ధన్‌రెడ్డిలు రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఎస్‌ఏపీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రూ. 1.50లక్షల చెక్కును ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ముత్తార్‌షరీప్‌ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అశోక్‌ క్యాటరింగ్‌ యజమాని అశోక్‌ 5వ రోజు ప్రభుత్వ దవాఖాన భోజనం అందించారు. 

అనంతగిరిలో కోతుల ఆకలి తీర్చిన పాల వ్యాపారి

కరోనా నేపథ్యంలో  లాక్‌డౌన్‌ సందర్భంగా అనంతగిరిలో కోతులకు ఆహారం కరువైపోయింది. పాల వ్యాపా రి లక్ష్మణ్‌  కోతులు, ఆవులకు క్యారేట్‌, స్వీట్‌కార్న్‌, కూరగాయలను  అందించాడు. 

 ఆశ వర్కర్లు సర్వే.. 

పరిగి నమస్తే తెలంగాణ : పరిగి నియోజకవర్గంలో   పరిగి పట్టణంతో పాటు కులకచర్ల, దోమ, పూడూరు మండల కేంద్రాలు, గ్రామాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.   ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు హాజరైన పరిగికి చెందిన వ్యక్తి ఖాన్‌కాలనీలో ప్రార్థనలకు హాజరైనట్లు తెలియడంతో ఆయన ఎవరేవరిని కలిశారనే విషయమై ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు సర్వే చేశారు. ఇప్పటికే సదరు వ్యక్తిని ఐసొలేషన్‌కు అనంతగిరికి తరలించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఓ మహిళ కరోనాతో మృతిచెందగా వారి ఇంటికి వెళ్లివచ్చిన పరిగికి చెందిన బంధువును సీఐ లక్ష్మిరెడ్డి కలిసి వివరాలు సేకరించారు. హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, హైదరాబాద్‌ నుంచి కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్న వారికి స్వేరోస్‌ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటుచేశారు. 

విలేకరులకు నిత్యావసర సరుకులు

యాలాల మండలంలో వివిధ పత్రికలలో పనిచేస్తున్న విలేకరులకు యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌ శనివారం నిత్యావసర సరుకులను అందించారు.  యాలాల సర్పం చ్‌ సిద్రాల సులోచన వలస కూలీలకు బియ్యాన్ని పంపిణీ చేశారు.

ఉద్యోగులకు భోజన సదుపాయం

  • కొడంగల్‌లో   విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్య, మున్సిపాలిటీ సిబ్బందికి     పున్నంచంద్‌ లాహోటీ    ఆయన నివాసంలో భోజన సదుపాయం కల్పించారు.  ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్‌లకు మున్సిపల్‌ 2వ వార్డు కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌ కోళ్లను పంపిణీ చేశారు. ఆర్‌ఎంపీ సంఘం ఆధ్వర్యంలో ఉదయం పోలీసులకు అల్పాహారం అందజేశారు. 
  • బొంరాస్‌పేటలోని  చిల్‌ముల్‌మైలారంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు టీటీ రాములు నాయక్‌ పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. 
  • టేకల్‌కోడ్‌లో పూణె నుంచి వచ్చిన వలస కూలీకి సర్పంచ్‌ గుండప్ప వైద్య పరీక్షలు నిర్వహింపజేసి ఇంట్లో నే ఉండాలని సూచించారు. 
  • పూడూరు మండల పరిధిలో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే రోడ్డు జిల్లా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు చన్గోముల్‌ ఎస్సై భీమ్‌ కుమార్‌కు, పోలీస్‌ సిబ్బందికి జడ్పీటీసీ శానిటైజర్‌, మాస్కులను అందజేశారు.
  • కులకచర్ల, దోమ మండలల్లో ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి సందర్శించారు. మండల కేంద్రాల్లోని రేషన్‌ దుకాణాలను ఆయన పరిశీలించి డీలర్లను బియ్యం పంపిణీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.