సోమవారం 25 మే 2020
Rangareddy - Mar 31, 2020 , 23:25:02

కార్మికులకు అండగా ప్రభుత్వం

కార్మికులకు అండగా ప్రభుత్వం

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ / ఇబ్రహీంపట్నంరూరల్‌ : వలస కార్మికులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో నేపాల్‌, బీహార్‌, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం, పప్పులు, నూనె, ఇతర నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నివారణకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న లాక్‌డౌన్‌ నిర్ణ యం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ప్రజలం తా లాక్‌డౌన్‌ పాటిస్తూ ఇండ్ల నుంచి బయటకు రా కుండా సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యం గా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. లాక్‌డౌన్‌ నేపథ్యాన్ని ప్రజలకు వివరించాలని ఆయన కౌన్సిలర్లకు సూచించారు. ప్రజలకు సేవలను అందిస్తున్న వైద్యసిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను ఆయ న అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కప్పరి స్రవంతి, వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, కమిషనర్‌ ఇషాక్‌ అబ్కాన్‌, కౌన్సిలర్లు యాచారం సుజాత, నీలం శ్వేత, మంద సుధాకర్‌, బర్తాకి జగన్‌, అల్వాల జ్యోతి, నల్లబోలు మమత, ముత్యాల ప్రసన్నలక్ష్మి, ఇందిరాల రమేశ్‌, నీళ్ల భానుబాబు, నాయకులు మహేశ్‌గౌడ్‌, మంఖాల దాసు పాల్గొన్నారు. 

కూలీలకు బియ్యం అందజేత..

 ఇటుక బట్టీలతో ఇతర పనులు చేసుకుని జీవిస్తున్న వలస కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కర్ణంగూడలోని ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒరిస్సా కూలీలకు ఆయన మంగళవారం ఆర్డీఓ అమరేందర్‌తో కలిసి ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, నూనె అందజేశారు.  ఇటుక బట్టీల్లో పనిచేసే ప్రతి కార్మికుడికి నిత్యావసర సరుకులు, బియ్యం తప్పనిసరిగా అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్‌, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, సర్పం చ్‌ కవిత, తిరుమల్‌రెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు, అధికారులు పాల్గొన్నారు. ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలతో పాటు ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తున్న 3982 మంది కార్మికులకు మంగళవారం బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను అందజేశారు. రాయపోల్‌, ముకునూరు, కప్పాడు, తులేకలాన్‌, చర్లపటేల్‌గూడ, ఎలిమినేడు, పోచారంలో పనిచేస్తున్న కార్మికులందరికి అధికారులు, గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. 


logo