బుధవారం 03 జూన్ 2020
Rangareddy - Mar 31, 2020 , 23:22:51

వలస కూలీలకు రేషన్‌

వలస కూలీలకు రేషన్‌

 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో కుటుంబ ఆహార భద్రతకార్డు ఉన్నవారికి, వలస కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా పరిధిలో జీహెచ్‌ఎంసీతో కలుపుకుని మొత్తం 4,89,705 ఆహార భద్రతాకార్డులుండగా.. వీటిలో 16,56,674మంది లబ్ధిదారులున్నారు. వీరందరికీ ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున బియ్యం అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మంగళవారం వలస కార్మికులకు బియ్యం  పం పిణీ చేస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన కార్మికుల్లో చేవెళ్ల మండలంలో 178, షాబాద్‌ మండలంలో 682, శంకర్‌పల్లి మండలంలో 387మంది, మొయినాబాద్‌ మండలంలో 642మంది ఉన్నారు. అలాగే షాబాద్‌నగర్‌ డివిజన్‌లో 1667మంది, ఆమనగల్లు మండలంలో 250, కడ్తాల్‌ మండలంలో 300, తలకొండపల్లి మండలంలో 590మంది ఉన్నట్లు గుర్తించారు. కాగా ప్రభుత్వం మంగళవారం జిల్లావ్యాప్తంగా 37,894మందికి 454.728 మెట్రిక్‌ బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి ఉచితంగా బియ్యం పంపిణీతోపాటు నగదు పంపిణీని రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. కాగా వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమా న్ని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ బండ్లగూడ, కిస్మత్‌పూర్‌, రాజేంద్రనగర్‌లో పరిశీలించారు. అలాగే మంఖాల్‌లో వైద్య బృందాలు హోం క్వారంటైన్‌ను తనిఖీచేశారు. మహేశ్వరం మండలంలో 38మంది హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని, వారికి ప్రత్యే క స్టాంపు వేయడంతో పాటు వారి ఇండ్లకు ప్రత్యేక స్టిక్క ర్లు అతికించినట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఇటీవల ఢిల్లీలె జరిగిన జమాతే సభలో పాల్గొని వచ్చినవారి వివరాలను కలెక్టరేట్‌ నుంచి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ విచారించే ప్రక్రియను పర్యవేక్షించారు. కందుకూరు డివిజన్‌ లో హోం క్వారంటైన్‌ ఉన్న వారిని తమ సర్వేలెన్స్‌ బృందాలు పరిశీలించాయని ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు రాలేదని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. logo