సోమవారం 25 మే 2020
Rangareddy - Mar 30, 2020 , 00:26:26

వలస కార్మికులకు ఇబ్బందులు రానివ్వం

వలస కార్మికులకు ఇబ్బందులు రానివ్వం

  • లాక్‌డౌన్‌ ఉన్నన్ని రోజులు కూలీలకు పరిశ్రమలే  జీతాలు చెల్లిస్తాయి
  • నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్మితే చర్యలు
  • షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌

నందిగామ: వలస కార్మికులకు ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ అన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి నందిగామ పారిశ్రామిక వాడలోని వివిధ పరిశ్రమలలో పని చేస్తూ జీవనం సాగిస్తున్న వలస కార్మికులు నిత్యావసర వస్తువులు దొరకక ఇబ్బందులు పడుతున్నరనే సమచారంతో ఆదివారం నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడలో వలస కార్మికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామకృష్ణ హాజరై కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్ముతున్నారని, తాగేందుకు మంచి నీరు లభించడం లేదని, లాక్‌డౌన్‌లో తమకు జీతాలు చెల్లించే విధంగా చూడాలని కార్మికులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  పరిశ్రమలలో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి లాక్‌డౌన్‌ ఉన్నంన్ని రోజులు పరిశ్రమలే వేతనం చెల్లిస్తాయన్నారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కిరాణాషాపు యాజమానులను హెచ్చరించారు. దేశా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉందని, కార్మికులు తమ సొంత గ్రామలకు వెళ్లేందుకు ప్రయాత్నం చేయకూడదని, ఇండ్ల నుంచి బయటకు రాకూడదని, కరోనా వైరస్‌ నియంత్రనకు తీసుకొవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

 ఆకలి తీరుస్తున్నారు..

మొయినాబాద్‌ :  కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ చేయడంతో  హైదరాబాద్‌లో బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీలు సొంత  ఇండ్లకు బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు ఆకలి, దహానికి అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వారిని చూసిన కొందరు హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న వారికి భోజనం పెడుతున్నారు. శనివారం బీజేపీ నాయకులు కంజర్ల ప్రకాశ్‌, ఎం. మధుసుదన్‌రెడ్డి కొందరు వలస కూలీలకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. అదే విధంగా మండల పరిధిలోని అమ్డాపూర్‌ గ్రామంలో మిషన్‌ భగీరథ పనులు చేస్తున్న  వలస కూలీలను ఎటు వెళ్లనివ్వకుండా పోలీసులు అమ్డాపూర్‌ సర్పంచ్‌  బూర్గు రవళిగోపికృష్ణారెడ్డితో భోజనాలు పెట్టిస్తున్నారు. 


logo