సోమవారం 25 మే 2020
Rangareddy - Mar 30, 2020 , 00:22:59

ఔటర్‌పై రాకపోకలు నిషేధం

ఔటర్‌పై రాకపోకలు నిషేధం

  • బొంగుళూరు ఎగ్జిట్‌  వద్ద  హెచ్చరిక  బోర్డు  ఏర్పాటు
  • గ్రామాల్లో రోడ్డుపై వేసిన కంచెల  తొలగింపు

ఇబ్రహీంపట్నం, నమస్తేతెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు ఆదివారం నుంచి ఓఆర్‌ఆర్‌ను బొంగుళూరు గేటు సమీపంలో మూసివేశారు.  పూర్తిస్థాయిలో వాహనాలు బయటకు రాకపోవడంతో ఓఆర్‌ఆర్‌పైన కొందరు అతివేగంగా వాహనాలను నడుపుతూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల పెద్దగోల్కొండ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై లారీ అతివేగంగా వచ్చి బొలోరో వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆదివారం నుంచి ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలను నిషేధించారు. బొంగుళూరు ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఎగ్జిట్‌ రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమించి ఓఆర్‌ఆర్‌పైకి భారీ వాహనాలు ప్రవేశిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు. ఓఆర్‌ఆర్‌ వద్ద టోల్‌గేట్‌ వద్ద కూడా భారీ వాహనాలను అనుమతించడం లేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఓఆర్‌ఆర్‌పైకి భారీ వాహనాలు అనుమతించేది లేదని పోలీసులు తెలిపారు. 

తెరుచుకుంటున్న గ్రామాల రోడ్లు..

లాక్‌డౌన్‌తో వారంరోజులుగా గ్రామాల రహదారులను మూసివేశారు. దీంతో గ్రామాలకు వచ్చివెళ్లే వాహనాలదారులతో పాటు ఎమర్జెన్సీ వాహనాలు ఇబ్బందులకు గురవుతుండటంతో రోడ్లపై కంచెలను తొలగిస్తున్నారు. ఆదివారం మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సాగర్‌రోడ్డు-శ్రీశైలం రహదారి లింక్‌ చేసే రోడ్డును తులేకలాన్‌ వద్ద వేసిన కంచెను తొలగించారు. అనేక గ్రామాలకు వేసిన కంచెలను కూడా ఎమర్జెన్సీ సర్వీసుల నేపథ్యంలో తెరుస్తున్నారు. 


logo