శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 21, 2020 , 23:26:25

పకడ్బందీ చర్యలు

పకడ్బందీ చర్యలు

  • హోం క్వారంటైన్‌ 
  • ముద్ర వేసి 14 రోజులు బయటకు వెళ్లకుండా చర్యలు
  • 48 ప్రత్యేక బృందాల ఏరా ్పటు  n 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పటిష్టం
  • కరోనా నివారణ, జనతా కర్ఫ్యూపై కలెక్టర్‌
  • అమయ్‌ కుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ 
  • మండల అభివృద్ధి అధికారులు,మండల తహసీల్దార్లు
  • నోడల్‌ అధికారులుగా నియామకం 

కొవిడ్‌-19 వైరస్‌ను నివారించేందుకు హోమ్‌ చైన్‌ బ్రేక్‌ చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. జిల్లాలో కరోనా నివారణకు పనిచేస్తున్న 48 ప్రత్యేక బృందాలు, 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత పటిష్టం చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  జిల్లాలో కోవిద్‌-19 వైరస్‌ నివారణకు పెద్దఎత్తున చర్యలు చేపట్టిన ట్లు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ వెల్లడించారు. కరోనా నివారణకు 48 ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేయడంతోపాటు పీహెచ్‌సీలవారీగా ఒక్కో ప్రత్యేక టీమ్‌ల ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మరో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జీహెచ్‌ ఎం సీ పరిధిలో ఐదు టీమ్‌ల ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు చెప్పారు. గేటెడ్‌ కమ్యూనిటీ అసోసియేషన్‌ సభ్యులు విదేశాల నుంచి ఎవరైనా వచ్చినట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారు నేరు గా ఫ్లయిట్‌ మార్గాల ద్వారా కాకుండా ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు మీదుగా జిల్లా పరిధిలోకి వస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. వారందరినీ కూడా గుర్తించి హోం క్వారంటైన్‌ చేస్తామన్నారు. విదేశాల నుంచి వస్తున్నవారిని గుర్తించి వారి చేతికి హోం క్వారంటైన్‌ ముద్ర వేసి 14రోజులు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్య లు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. విదేశాల నుంచి 588మంది వచ్చారని, వీరే కాకుండా వివిధ మా ర్గాల నుంచి మరో 40మంది వచ్చినట్లు ఇప్పటికే గుర్తించి వారిని ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామన్నా రు. గ్రామ పంచాయతీల్లోనూ ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి కరోనాపై అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కూడా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. జనతా కర్ఫ్యూ నిర్వహణకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సహకారంతో పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్నా రు. జనతా కర్ఫ్యూ విజయవంతం చేయాలని జిల్లాలోని అందరూ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కమిషనర్లను కూడా భాగస్వా మ్యం చేస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 5 గంటల అనంతరం జనతా కర్ఫ్యూ ప్రారంభానికి గుర్తుగా సైరన్‌లను మోగిస్తున్నట్లు చెప్పారు. జన సామర్ధ్యం అధికంగా ఉండే మార్కెట్‌లు, హోటళ్లు, సూపర్‌ మార్కెట్‌లలో ప్రత్యేక శానిటేషన్‌ చేపడుతున్నామన్నారు. ఇప్పటికే అన్ని మతాల పెద్దలతో సమావేశం నిర్వహించాం. ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రవేశాలను నిషేధిస్తున్నామని మత పెద్దలు స్వచ్ఛందంగా ప్రకటించారని గుర్తుచేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మార్చి 31 వరకు సామూహిక ప్రార్థనా మందిరాలన్నీ మూసివేసి ఉంచాలన్నారు. ప్రతిఒక్కరూ తమ పరిసరాల్లోకి విదేశాల నుంచి ఎవరు వచ్చారో సమాచారాన్ని 104కు తెలుపాలని, కరో నా పాజిటివ్‌ ఉండి సమాచారం ఇవ్వకుండా, చికిత్స పొం దకుండా అక్రమంగా ఉండేవారిపై కఠిన చర్యలు చేపట్టడంతోపాటు అరెస్ట్‌చేసి క్వారంటైన్‌ కేంద్రాలకు పంపడం జరుగుతుందన్నారు. కరోనా నివారణ,  చైతన్యంపై కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు, కరోనాపై ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 425 0817. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌.. 040 - 23230811, 23230813, 23230814, 23 230817ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చెత్తసేకరణ చేసే ఆటోల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. 

జనతా కర్ఫ్యూ ఏర్పాట్లు చేశాం : సీపీ సజ్జనార్‌ 

ఆదివారం ఉదయం 6గంటలనుంచి సోమవారం ఉద యం 6 వరకు జరిగే జనతా కర్ఫ్యూ నిర్వహణకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సహకారంతో పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. జనతా కర్ఫ్యూ విజయవంతం చేయాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేశామన్నారు. రెవె న్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కమిషనర్లను కూడా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఇది స్వచ్ఛందంగా ప్రజ లు తమకు తాముగా పాటించే కర్ఫ్యూ అన్నారు. జిల్లాలో 48 బృందాలు తిరుగుతున్నాయన్నారు. జిల్లాలో కంట్రోలు రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా వ్యాధిగ్రస్తులు ‘హోం క్వారంటైన్‌' బాధితులు బయట కనిపిస్తే తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

చప్పట్లు కొట్టి సంఘీభావం

ఉదయం 5.30గంటలకు జనతా కర్ఫ్యూ ప్రారంభమైనట్లు సైరాన్‌ మోగుతుంది. సాయంత్రం 4.30గంటలకు మళ్లీ సైరన్‌ మోగిస్తారు. సాయంత్రం 5గంటలకు చప్పట్ల ద్వారా ప్రజలు సంఘీభావం తెలుపాలని జిల్లా అధికారులు పిలుపునిచ్చారు. అందరూ పాల్గొని జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ నిరోధానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలుపాలన్నారు.logo