గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 21, 2020 , 00:42:16

వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

 • కనులపండువగా వెంకటేశ్వరస్వామి కల్యాణం
 • పెద్ద ఎత్తున హాజరైన గ్రామస్తులు
 • ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక పూజలు 

  ఇబ్రహీంపట్నం మండలం కప్పాడు గ్రామంలో శుక్రవారం వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.  పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో పాటు స్థానికులు, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకకు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. కల్యాణం సందర్భంగా భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు.

   ఇబ్రహీంపట్నంరూరల్‌ : కప్పాడు గ్రామంలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం గ్రామ పంచాయతీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. కరోనా వ్యాధి ప్రభావంతో కల్యాణానికి పరిసర గ్రామాల భక్తులు హాజరు కాలేదు. గ్రామస్తుల సమక్షంలో పూజారులు వేదమంత్రాలతో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీపీ కృపేశ్‌,  సత్తు వెంకటరమణారెడ్డి, నాయకులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కప్పాడు వేంకటేశ్వరస్వామి నమ్మిన భక్తులకు వరాలు కురిపిస్తున్న గొప్పదైవమని తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, సర్పంచ్‌ సామల హంసమ్మ, ఉపసర్పంచ్‌ మునీర్‌, నిట్టు జగదీశ్వర్‌, డైరెక్టర్‌ బాల్‌రెడ్డి, మోహీజ్‌పాషా, ఏనుగు బుచ్చిరెడ్డి, జెర్కోని రాజు, తాళ్ల మహేశ్‌గౌడ్‌, ఆకుల సురేశ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మల్లారెడ్డి, నిట్టు వీరయ్య, సతీశ్‌గౌడ్‌, జంగిలి మహేశ్‌, ఏర్పుల  యాదయ్య, శంకరయ్యగౌడ్‌, లచ్చలుగౌడ్‌, సత్యనారాయణ, జలందర్‌ పాల్గొన్నారు. 


   logo