బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 20, 2020 , 00:48:52

‘మిషన్‌' సక్సెస్‌

‘మిషన్‌' సక్సెస్‌

  • థుపతి ఇంటికీ ‘భగీరథ’ జలాలు     కనబడని నీళ్ల తిప్పలు
  • నీటి సరఫరాతో గ్రామాల్లో తీరిన నీటి ఇబ్బందులు
  • మండలం రుద్రారంలో 210 ఇండ్లకు పుష్కలంగా  నీరు
  • మంది జనాభాకు రోజుకు 100 లీటర్ల చొప్పున తాగునీరు
  • లీటర్ల నీటి సామర్థ్యం గల రెండు ట్యాంకుల ద్వారా రోజుకు 89,700 లీటర్ల నీటి సరఫరా

షాబాద్‌, నమస్తే తెలంగాణ : తాగునీటి కోసం ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఖాళీ బిందెతో రోడ్డుపైకి రావద్దనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా గ్రామాల్లో విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రతి ఇంటికీ భగీరథ జలాలు అందుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌ మండలం అంతారం వద్ద రూ. 275 కోట్లతో నిర్మాణం చేపట్టిన మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 218 గ్రామాలకు ఇంటింటికీ నల్లానీరు అందిస్తున్నారు. అందులో షాబాద్‌ మండలంలోని రుద్రారం గ్రామంలో 897 మంది జనాభా ఉంది. రోజుకు ఒక్కరికి 100 లీటర్ల చొప్పున 89,700 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో మహిళలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే తెలంగాణ రుద్రారం గ్రామాన్ని విజిట్‌ చేసి భగీరథ నీటి సరఫరాపై మహిళల అభిప్రాయాలు సేకరించింది. 

పుష్కలంగా భగీరథ జలాలు..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ కార్యక్రమంతో గ్రామానికి పుష్కలంగా నీరు అందుతున్నది. గత రెండేండ్లుగా గ్రామంలో ప్రజలకు నీటి కష్టాలు దూరమయ్యాయి. ప్రతి రోజు ఉదయం పూట రెండు నుంచి మూడు గంటల పాటు నీటిని వదులుతున్నారు. దీంతో తమకు కావాల్సినన్ని నీటిని వినియోగించుకుంటున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రుద్రారంలో 210 ఇండ్లకు తాగునీరు

షాబాద్‌ మండలంలోని రుద్రారం గ్రామంలో మొత్తం 210 నివాసాలు ఉంటాయి. 897 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో ఉన్న రెండు ట్యాంకుల్లో కలిసి లక్ష లీటర్ల నీటి సామర్థ్యం ఉంది. ప్రజలకు ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున మొత్తం 89,700 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామంలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యేవి. రోజుకు రెండు బిందెల నీరు కూడా వచ్చేది కాదని ప్రజలు చెబుతున్నారు. వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకునేవాళ్లమంటున్నారు. గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు వెచ్చించి అప్పట్లో ఉన్న సర్పంచ్‌లు ట్యాంకర్ల ద్వారా రెండు రోజులకొకసారి ప్రజలకు నీరు అందించేవారు. 

ఇవే నీళ్లు తాగుతున్నాం..

భగీరథ నీళ్లు వచ్చినంక అందరం అవే నీళ్లు తాగుతున్నాం. ముందు రూ. 20 పెట్టి ఫీల్టర్‌ నీళ్లు కొని తాగుతుంటిమి. ఇప్పుడు ఇంటింటికీ నల్లాలు వేసి నీళ్లు ఇస్తున్నారు. ఫీల్టర్‌ నీళ్లకన్నా కేసీఆర్‌ సార్‌ ఇచ్చే నీళ్లే మంచిగున్నాయి. అందుకని అందరం ఇవే నీళ్లు తాగుతున్నాం. ఈ సర్కార్‌ను ఎప్పటికీ మరిచిపోము.  

- కళమ్మ, రుద్రారం

బోర్ల కాడినుంచి తెచ్చుకునేటోళ్లం

మేము చిన్నగున్నప్పుడు ఊరిలో నీళ్లులేక బోర్లకాడి నుంచి తెచ్చుకునేటోళ్లం. ఈ సర్కార్‌ రాకముందు నీళ్లు సరిగ్గా వచ్చేవి కావు. కేసీఆర్‌ వచ్చినంక అన్ని ఇండ్లకు నల్లాలు వేసి నీళ్లు ఇయ్యడం బాగుంది. బోర్ల కాడికి పోయి నీరు తెచ్చుకునే బాధలు తప్పినయి. 

  - రాంచంద్రారెడ్డి, రుద్రారం

ట్యాంకర్లతో నీరు పోయిస్తుండే ..

ఇంతకు ముందు ఎండాకాలం వచ్చిందంటే చాలు గ్రామంలో నీటి కష్టాలు చాలా ఉండేవి. బోర్లల్లో నీళ్లు లేకపోవడంతో నల్లాలు సరిగ్గా వచ్చేవి కాదు. ముందున్న సర్పంచ్‌లు ట్యాంకర్లతో ఇండ్లకు తాగునీటిని పోయించేవారు. కేసీఆర్‌ సార్‌ వచ్చినంక నల్లానీరు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. 

 - బాలమణి, రుద్రారంlogo