గురువారం 09 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 20, 2020 , 00:44:20

తొలి రోజు ‘పది’ ప్రశాంతం

తొలి రోజు ‘పది’ ప్రశాంతం

  • వసతి గృహాల విద్యార్థులకు మాస్క్‌ల అందజేత
  • కరోనా ఎఫెక్ట్‌..  మాస్క్‌లతో హాజరు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. జిల్లా విద్యాధికారి  విజయలక్ష్మీ పదో తరగతి పరీక్షలు మొదలయ్యాక పలు కేంద్రాలను పరిశీలించారు.  నిఘా నీడలో పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 208 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 47,181 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 47,078 మంది హాజరయ్యారు. తెలుగు పరీక్ష-1కు 103 మంది విద్యార్ధులు గైర్హాజరు అయ్యారని ఆమె చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్ధులు మాస్కులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులకు ఆ శాఖ అధికారులు మాస్క్‌లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పరీక్షకు గంట ముందుగానే పరీక్షా హాల్లోకి అనుమతించే విధంగా నిబంధనలు తీసుకురావడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. మాస్కులు ధరించి పరీక్ష కేంద్రం ఛీప్‌ సూపరిండెంట్లు, ఇన్విజిలేటర్లు  హాజరయ్యారు. కరోనా వైరస్‌తో  తొలి రోజు విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. దగ్గు, జలుబు తదితర సమస్యలు ఉన్న వారెవరూ రిపోర్ట్‌ కాలేదని జిల్లా వైద్యధికారులు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని  సిబ్బంది చెప్పారు. సిట్టింగ్‌ స్కాడ్‌, ‘సీ’సెంటర్‌లో కస్టోడియన్లు 12, జిల్లా స్థాయి అబ్జర్వర్‌, డీఈవో, ప్లయింగ్‌ స్కాడ్స్‌ మొత్తం 67  కేంద్రాలను సందర్శించారు. logo