బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 19, 2020 , 00:40:38

కరోనాపై ప్రచారాస్త్రం

కరోనాపై ప్రచారాస్త్రం

  • కొవిడ్‌-19 నివారణకు జిల్లా  యంత్రాంగం సన్నద్ధం
  • 1060 గదులు.. 2020 బెడ్స్‌ ఏర్పాటు.. 
  • డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆథారిటీ జిల్లా చైర్మన్‌గా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
  • నోడల్‌ అధికారిగా అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, కంట్రోలర్‌గా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి నియామకం 
  • అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం
  • జడ్పీ సీఈఓ, డీపీఓ, డీఆర్డీవోలు, జిల్లా పరిశ్రమల అధికారులకు  కలెక్టర్‌ ఆదేశాలు

కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో శంషాబాద్‌ విమానాశ్రయం ఉండడంతో విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులను నేరుగా ‘క్వారైంటన్‌' కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ జిల్లా చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ పలు చర్యలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధానికి పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ను నోడల్‌ అధికారిగా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మిని కంట్రోలర్‌గా నియమించారు.

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి పై జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. జిల్లాకు విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులను నేరుగా ‘క్వారైంటన్‌' కేం ద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లుచేశారు. జిల్లాకు పలు దేశాల నుంచి ప్రయాణికులు ఇటీవల చాలామంది రావడం, శంషా బాద్‌ విమానాశ్రయం ఉండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించా రు. అన్ని శాఖల అధికారులను సమన్వయంచేసి జిల్లాలోని పట్టణాలు, ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చినవారిని గుర్తించేపనిలో ఉన్నారు. ముఖ్యంగా నగర శివారు చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిం చింది. జిల్లాలో కోవిద్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు కేంద్రప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ కూడా కోవిద్‌ వైరస్‌ను నోటిఫైడ్‌ డిజాస్టర్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ కోవిద్‌ వైరస్‌ నిరోధానికి పలు చర్యలు చేపడుతూ ఉత్తర్వులు జారీచేశారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి చేపట్టే చర్యలపై పూర్తిస్థాయిలో పర్య వేక్షించడానికి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ను నోడల్‌ అధికారిగా నియమించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మిని కంట్రోలర్‌గా కలెక్టర్‌ నియ మించారు. కోవిద్‌ వైరస్‌ నివారణ, వ్యాప్తి నిరోధానికి నోడల్‌ అధికారి జారీ చేసే ఆదేశాలను అన్ని శాఖల అధికారులు, వారి సబార్డినేట్‌ అధికారులు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇతర దేశాలనుంచి వచ్చేవారి సమాచారాన్ని స్థానిక దవాఖానలకు సమాచారాన్ని అందించాలని సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లను కోరారు. అదేవిధంగా కరోనా వ్యాధిపై తప్పుడు ప్రచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా గానీ ఇత ర మీడియాల ద్వారా గానీ చేసే వారిపట్ల కఠిన చర్యలు చేపట్టా లని పోలీస్‌ కమిషనరేట్లకు సూచించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతి ఇవ్వవద్దని స్పష్టంచేశా రు. కరోనా వైరస్‌ నివారణకు రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చే నియ మ, నిబంధనలను అనుసరించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడంతో పాటు కరోనా వైరస్‌ నివారణపై కరపత్రాలు, ఇతర ప్రచార సామాగ్రిని పెద్దఎత్తున పంపిణీ చేయాలని జిల్లా ఆరోగ్య వైద్యశాఖాధికారి, కొండాపూర్‌ డీసీహెచ్‌ఎస్‌లను కలెక్టర్‌ ఆదేశిం చారు. కరోనా నివారణపై పెద్దఎత్తున అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు సినిమాహాళ్లలో ైస్లెడ్‌లను ప్రదర్శించడం, వార్డులవారీగా పరిశుభ్రత పాటించడం, పబ్లిక్‌ టాయిలెట్‌లను శుభ్రంగా ఉంచడం, కరోనావ్యాధి నివారణపై ప్రత్యేకంగా హెల్ప్‌సెంటర్లు, సమాచార కేంద్రాలు తెరువాలని జిల్లాలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లను కలెక్టర్‌ ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నెంబర్‌ 104, నేషనల్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 011- 23978046 ఈ నంబర్లపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని అమయ్‌ కుమార్‌ ఆదేశించారు. తమ క్షేత్రస్థాయి సిబ్బం దితో కరోనా వైరస్‌పై అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పరిషత్‌ సీఈఓ జితేందర్‌రెడ్డి, జిల్లా పంచాయత్‌ అధికారి పద్మజారాణి, డీఆర్డీఓలను, జిల్లా పరిశ్రమల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసి కరోనా నివారణకు చర్యలు చేపట్టాలని ఆర్డీఓలను ఆదేశించారు. మాస్క్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా, అధిక ధరలకు మందులు, మాస్క్‌లు విక్రయించకుండా చర్యలు చేపట్టాలని జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు.

22చోట్ల ఐసోలేషన్‌ కేంద్రాలు

  ఇప్పటికే జిల్లాలో 22చోట్ల ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.12కేంద్రాల్లో గదులు, బెడ్లు సిద్ధం చేశారు. అలాగే వైద్యుల నియామకం చేపట్టారు. ఈ కేంద్రాలకు 25మంది ప్రత్యేకాధికారులను నియమించారు. అలాగే బుధవారం కూడా జిల్లాలో 1060గదులు, 2020 బెడ్లను సిద్ధం చేశారు. logo