మంగళవారం 07 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 19, 2020 , 00:33:16

డబుల్‌ స్పీడ్‌!

డబుల్‌ స్పీడ్‌!

  • జిల్లాలో 6,777 ప్రతిపాదిత ఇండ్లు 
  • 6645 మంజూరు కాగా, 6383 టెండర్లు పూర్తి
  • బడ్జెట్‌లో రూ.11,917 కోట్లు కేటాయింపు
  • 1.97 లక్షల దరఖాస్తులు 
  • త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు కసరత్తు 
  • కందుకూరులో4 ఎకరాల భూదాన్‌ భూమిని కేటాయించేందుకు ఏర్పాట్లు 
  • కాంట్రాక్టర్లు ముందుకొచ్చేలా ప్రణాళికలు

పేదలకు పైసా భారం లేకుండా సొంతింటి కలను సాకారం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. జిల్లాలో ప్రతిపాదిత ఇండ్లు మొత్తం 6,777 కాగా, వీటిలో 6645 మంజూరైనవి, 6383ల కు టెండర్లు పిలిచారు. జిల్లా వ్యాప్తంగా 1,97,702 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.11,917 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో ఇప్పటికే మంజూరై నిర్మాణంలో ఉన్న ఇండ్ల పనుల్లో మరింత వేగం పెరుగనున్నది. జిల్లాకు మరిన్ని ఇండ్లు మంజూరయ్యే అవకాశం ఉన్నది. మిగతా వాటికి టెండర్లను పిలిచి, త్వరితగతిన పూర్తి చేయనున్నారు. మరిన్ని ప్రాంతాల్లో నివాస యోగ్యమైన స్థలాలు ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.     

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నిరుపేదల సొంతింటి కలను రాష్ట్రప్రభుత్వం సాకారం చేస్తున్నది. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04లక్షలు, పట్ట ణ ప్రాంతాల్లో రూ.5.30లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో జీ+3కి రూ.7లక్షలు, జీ+సీ+ఎస్‌+9 రూ.7.90లక్షల చొప్పున వెచ్చించి నిర్మిస్తున్నది. మొత్తం 6,777ఇండ్లు మంజూరు చేయగా, వీటిలో అడ్మిన్‌ మంజూరైనవి 6645 కాగా.. 6383 టెండర్లు పిలిచారు. 3300ఇండ్లు టెండర్లు పూర్తి అయ్యాయి. వీటిలో 2,467ఇండ్ల నిర్మాణపనులు ప్రారం భమయ్యాయి. అయితే జిల్లావ్యాప్తంగా 1,97,702 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా బడ్జెట్‌లో ప్రభుత్వం ఇం డ్ల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,917కోట్లు కేటాయిచింది. దీంతో పాటు జిల్లాకు మరిన్ని ఇండ్లు మంజూరయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం పథకం చరిత్రలో నిలిచిపోనుంది. మరిన్ని ప్రాంతాల్లో నివాస యోగ్యమైన స్థలాలను ఎంపిక చేసేందుకు అధికారులకు కసరత్తు చేస్తున్నారు.

246.88ఎకరాల్లో.. 6,645ఇండ్ల నిర్మాణం ...

ప్రభుత్వం రెండు పడకల గృహం పథకం ప్రణాళికలో భాగంగా 2015-16, 2016-17 వార్షిక సంవత్సరంలో జిల్లాలో 6,777 బెడ్రూం రూంలు కేటాయించారు. స్థానిక శాసనసభ్యులు, మంత్రుల కమిటీల ద్వారా కలెక్టర్‌ 6,645 ఇండ్లను నిర్మించేందుకు మంజూరుచేశారు. ఈ ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం భూమి 246.88 ఎక రాలు సేకరించారు. 6,645ఇండ్ల మంజూరులో చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల 1,798ఇండ్లను జిల్లా పంచా యతీరాజ్‌కు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం,  రాజేంద్ర నగర్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 4,979 ఇండ్లను జిల్లా ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో డబుల్‌ బెడ్రూం నిర్మాణం G+3 నిర్మాణ క్రమం C+S+9 నిర్మాణం క్రమంతో జీహెచ్‌ఎంసీ అధికారులు 2 బీహెచ్‌కే ఇండ్లు నిర్మిస్తున్నారు.

కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేలా ప్రణాళికలు

టెండర్లు నిర్వహించేటప్పుడు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చి వారి చేత కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే లా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మంజూరైన డబుల్‌ బెడ్రూంలకు మరో రూ.84కోట్ల నిధులు మౌళిక సదుపా యాల కల్పనకు అవసరం అవుతాయని, వాటి మంజూరు కోసం ప్రతిపాదనలు సిద్ధంచేశారు.  

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై)

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ పథకంలోని యూనిట్‌ విలువ రూ.1.20లక్షలు, అలాగే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పట్టణ పథకంలోని యూనిట్‌ విలువ రూ.1.50లక్షల వాటాను రెండు పడకల యూనిట్‌కు అనుసంధానం చేశారు.

1.97 లక్షల డబుల్‌ దరఖాస్తులు 

జిల్లాలోని రెండు పడకల మంజూరు కోసం ఇప్పటివరకు 1,97,702 దరఖాస్తులు వచ్చాయి. వారికి దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాల్లో వారి పేర్లను నమోదు చేసుకున్నారు.


logo