శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 17, 2020 , 00:21:29

పథకాల అమలులో.. అలసత్వం వద్దు

పథకాల అమలులో.. అలసత్వం వద్దు
  • అర్హులకు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
  • రైతుల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
  • కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌
  • కందుకూరులో తహసీల్దార్లతో సమీక్ష సమావేశం

ఆమనగల్లు,నమస్తేతెలంగాణ:  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, పంపిణీలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అధికారులకు సూచించారు. సోమవారం కందుకూర్‌ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి సమక్షంలో నాలుగు మండలాల తహసీల్దార్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైతుబంధు, కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌,శ్మశాన వాటికల నిర్మాణాలు, డబుల్‌ఇండ్లు, పాసుబుక్కుల పంపిణీ,డంపింగ్‌యార్డు,సీసీ రోడ్ల నిర్మాణాలు తదితర అభివృద్ధి పథకాల గురించి మండలాల వారీగా అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పల్లెప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతి, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణలో అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల సిబ్బందితో కలిసి ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. మండలాల వారీగా చేపట్టే శ్మశాన వాటిక స్థలాలు, డబుల్‌ఇండ్లకు ప్రభుత్వ స్థలాల గుర్తింపు, ప్రభుత్వం సామాజిక కార్యక్రమాలకు వినియోగించే కార్యక్రమాల పనితీరును మరింతగా వేగం పెంచాలని తహసీల్దార్లకు ఆయన సూచనలు చేశారు.   కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు, రైతుల భూసమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు చందర్‌రావు, శ్రీనివాస్‌, బాలరాజు, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీరప్ప కల్యాణంలో ఎమ్మెల్యే .. 

 మాడ్గుల:  మండలంలోని ఫిరోజ్‌నగర్‌(పేట) గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో భాగంగా బీరప్పకామరావతి కల్యాణాన్ని  కనుల పండువగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎంమ్మెల్సీ మల్లేశం, పంచాయతీరాజ్‌ చాంబర్‌ కార్యదర్శి సుద్దపల్లి సర్పంచ్‌ వెంకటేశ్‌గౌడ్‌  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంమ్మెల్సీలను సర్పంచ్‌ వెంకటమ్మ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ఫిరోజ్‌నగర్‌ గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌ వెంకటమ్మ టీఆర్‌ఎస్‌ నాయకులు ఏతం జంగయ్య, సత్తూర్‌ వెంకటయ్యగౌడ్‌, వరుణ్‌ కోరిన విధంగా నిధులను మంజూరు చేస్తానని తెలిపార. సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జి శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శంకర్‌నాయక్‌, ఎంపీటీసీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు  జైపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు రమేశ్‌రెడ్డి, వెంకటమ్మ, పద్మ, యాదిరెడ్డి, ఫ్యాక్స్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బాల్‌రాంనాయక్‌, ఫ్యాక్స్‌ డైరెక్టర్లు రాజవర్దన్‌రెడ్డి, జగ్‌పాల్‌రెడ్డి, సత్తిరెడ్డి, రమేశ్‌గౌడ్‌, వెంకటయ్యగౌడ్‌, జగన్‌గౌడ్‌ నాయకులు సుభాష్‌, శ్రీను, వెంకటయ్య, మల్లేశ్‌, రాములు, నారయ్య తదితరులు పాల్గొన్నారు. logo