మంగళవారం 31 మార్చి 2020
Rangareddy - Mar 17, 2020 , 00:12:26

పది పరీక్షలకు సర్వం సిద్ధం!

పది పరీక్షలకు సర్వం సిద్ధం!

‘పది’ పరీక్షలకు రెండు రోజులే ఉండడంతో అన్ని పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా మౌలిక వసతుల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. ముందస్తుగానే సెంటర్లకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్‌ షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 208 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లా వ్యాప్తంగా 47,155 మంది విద్యార్థులు హాజరవనున్నారు. ఈనేపథ్యంలో రేపటిలోపు ఒకసారి కేంద్రాలను సందర్శించాలని, ఆర్టీసీ బస్సు రూట్ల వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు. ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ విద్యార్థులను సమాయత్తం చేసింది.

  • 19 వ తేదీ నుంచి పరీక్షలు
  • పరీక్షా కేంద్రాల్లో సకల వసతులు
  • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
  • మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు
  • మొత్తం 208 సెంటర్లు...
  • రెగ్యులర్‌ కోసం 201, ప్రైవేట్‌ వారికి 7 కేటాయింపు
  • హాజరవనున్న 47,155 మంది విద్యార్థులు
  • 2025 మంది ఇన్విజిలేటర్ల నియామకం
  • కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

రంగారెడ్డి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘పది’ పరీక్షలకు  సర్వం సిద్ధం చేశారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇన్విజిలెటర్లు, పరీక్ష లు నిర్వహించే సిబ్బంది అంతా విద్యార్థులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని డీఈఓ వెల్లడించారు. పరీక్షా సమయానికి విద్యార్థులు నిముషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదని, ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతోపాటు ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను సందర్శించాలని, ఆర్టీసీ బస్సుల రూట్‌ వివరాలను తెలుసుకోవాలన్నా రు. జిల్లాలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలతోపాటు, ఆకస్మిక తనిఖీలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా పోలీస్‌శాఖలోని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్లతో సిట్టింగ్‌స్కాడ్‌లను నియమించారు. కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమల్లో ఉం టుందని, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతరులెవ్వరైనా పరీక్షా కేంద్రాల సమీపంలో ఉండకూడదన్నారు. కేంద్రాలకు అత్యంత సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని డీఈవో ఆదేశించారు. ఈ ఏడాది జిల్లా పరిధిలో మొత్తం 208 పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేయగా, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ వెంట హాల్‌ టికెట్‌, పెన్నులు, పెన్సిల్‌, పరీక్ష ప్యాడ్‌ లాంటివి తెచ్చుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో ప్రత్యేక బృందాలతో అంతర్గత మార్కుల పరిశీలన ఇప్పటికే పూర్తిచేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను మంచి స్థానంలో నిలిపేందుకు విద్యాధికారులు కసరత్తు చేస్తున్నారు. డీఈవోతో పాటు సెక్టోరియల్‌ అధికారులు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని సమీక్షించారు.  గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని తప్పులను సరిచేసుకుని 100శాతం ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఇప్పటికే అమలు చేస్తున్నా రు. ఫలితాల సాధనకు అలుపు లేకుండా ఉపాధ్యాయులు కసరత్తు చేస్తున్నారు. ఉదయం,సాయంత్రం ఒక విషయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లఘు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులు చేసిన తప్పులను వారికి వివరించి పునరావృతం కాకుండా చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల ముఖ్య పర్యవేక్షకులు,డీఈవోలతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు చేశారు.

47,155 మంది విద్యార్థులు..

   జిల్లాలో 208 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్‌ విద్యార్థుల కోసం 201, ప్రైవేట్‌గా రాసేవారికి 7 కేటాయించారు. జిల్లాలో 47,155మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 1450మంది ప్రైవేట్‌ విద్యార్థులు ఉన్నారు. ప్రతి కేంద్రంలో పరీక్షలను పర్యవేక్షించేందుకు సిట్టింగ్‌ స్కాడ్‌, అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స చేసేందుకు ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచుతున్నారు. 2025 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 

144 సెక్షన్‌ అమలు.. జిరాక్స్‌ సెంటర్లు మూసివేత..

  కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. 100 మీటర్ల దూరంలో ఎలాంటి చర్యలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తారు. సమీపంలో ఉన్న జిరాక్స్‌ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

పది జీపీఏ సాధనపై దృష్టి : విజయలక్ష్మి, జిల్లా విద్యాధికారి 

జిల్లాను పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మంచిస్థానంలో నిలిపేలా ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నాం. ముఖ్యంగా 10 జీపీఏ ఎక్కువస్థాయిలో సాధించేలా చేస్తున్నాం. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పది జీపీఏ సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. జిల్లాలో గతేడాది ఫలితాలతో పోల్చి తే ఈ దఫా మరింత మంచి ఫలితాలను సాధిస్తాం. విద్యార్థులను సబ్జెక్టులవారీగా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడంతోపాటు వార్షిక పరీక్షలకు వారిని మానసికంగా సిద్ధం చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. 


logo
>>>>>>