గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 16, 2020 , 00:19:56

రైతులకు అండగా ఉండాలి

రైతులకు అండగా ఉండాలి

రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతున్నది. రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. మరిన్ని ప్రాజెక్టులు నిర్మించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

  • సహకార సంఘాలు అన్నదాతల పక్షాన నిలువాలి
  • రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం
  • షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌
  • చేగూరు పీఏసీఎస్‌ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

నందిగామ:  సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు రైతులపక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు.  మండల పరిధిలోని చేగూరు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌ గొర్లపల్లి అశోక్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ మున్నురు పద్మారావు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవంను ఆదివారం తెలంగాణ కళాకారుల ఆట, పాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ హాజరై , జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌తో కలిసి నూతన పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ చైర్మన్‌లు రైతులకు అండగా ఉంటూ, వారి సంక్షేమానికి కృషిచేయాలన్నారు. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనైనా టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టంగట్టారని, దీంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్‌ పాలనలో రైతులను రాజులను చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని తెలిపార.  షాద్‌నగర్‌లోని లక్ష్మిదేవిపల్లి ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సహకార సంఘం ఎన్నికల్లో గెలుపొందిన చైర్మన్లు పట్టుదలతో పని చేసి రైతన్నల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసి, మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, కొత్తూరు ఎంపీపీ మధుసుదన్‌రెడ్డి, ఫరూక్‌నగర్‌ ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌, అహ్మద్‌, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్‌రెడ్డి, మేకగూడ, ఫరూఖ్‌నగర్‌ పీఏసీఎస్‌ చైర్మన్లు మంజులరెడ్డి, బక్కన్న యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నోముల పద్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు జెట్ట కుమార్‌, అశోక్‌, చంద్రరెడ్డి, స్వామి, రాజునాయక్‌, షాద్‌నగర్‌ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ నటరాజు, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కుమార్‌గౌడ్‌, బుగ్గ నర్సింహ, శ్రీశైలం, అంజనేయులు, యాదగిరిగౌడ్‌, శ్రీను, మధు, బేగ్‌, రమేశ్‌, శేఖర్‌చారి, పెబ్బె శేఖర్‌, దేవప్ప, నర్సింహ, విజయ్‌, పీఏసీఎస్‌ సీఈఓ వెంకటయ్య,  వివిధ గ్రామాల డైరెక్టర్లు, రైతులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


logo