శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 15, 2020 , 02:32:22

అతిథులొచ్చారు..

అతిథులొచ్చారు..

రంగులరంగుల అతిథి పక్షులు.. ఆకట్టుకునే చెరువు అందాలు.. పర్యాటకులు, పక్షి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి.. వేల మైళ్ల దూరం నుంచి ప్రతి వేసవిలో తరలివచ్చే సుమారు 150 రకాల విదేశీ పక్షులు, 120 రకాల స్థానిక పక్షి జాతులతో నగర సమీపంలోని అమీన్‌పూర్‌ చెరువు మరింత ఆహ్లాదకరంగా మారింది. ఎన్నో ఏండ్లుగా విదేశీ పక్షులకు ఆవాసకేంద్రమైన ఈ చెరువును.. తెలంగాణ ప్రభుత్వం మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నది. చెరువు మధ్యలో అక్కడక్కడ పక్షుల కోసం దీవులను ఏర్పాటు చేశారు. చెరువు పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దడానికి సుమారు 3.50 కోట్లు  కేటాయించి పనులు చేపడుతున్నారు. తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్‌ అమీన్‌పూర్‌ పెద్ద చెరువును దత్తత తీసుకొని అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కాగా ఇటీవల వచ్చి ఆవాసం ఏర్పర్చుకున్న అందమైన పక్షుల దృశ్యమాలిక మీ కోసం..


logo