గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 07, 2020 , 06:20:20

జలుబు, దగ్గు, జ్వరం ఉంటే.. కరోనా కాదు..

జలుబు, దగ్గు, జ్వరం ఉంటే.. కరోనా కాదు..
  • సాధారణ ప్రజలకు ‘కరోనా’ పరీక్షలు అవసరంలేదు
  • విదేశీ ప్రయాణికులు, వారితో సన్నిహితంగా ఉన్న వారికే..
  • గాంధీ జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డా. రాజారావు

నగరవాసులు అపోహలు వీడారు.. ‘కరోనా’ ఆందోళన నుంచి బయట పడ్డారు. ముఖ్యంగా మైండ్‌ స్పేస్‌ ఎపిసోడ్‌ కొంత కలవరపెట్టినా... ‘నో కొవిడ్‌-19’ అని తేలడంతో ఐటీ కారిడార్‌లో శుక్రవారం ‘వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ ఓన్లీ’ అంటూ... యథావిధిగా విధులకు హాజరయ్యారు టెకీలు. అయితే జలుబు, దగ్గు, జ్వరం ఉన్నంత మాత్రాన... కరోనా కాదని గాంధీ దవాఖాన జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాజారావు స్పష్టం చేశారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కొవిడ్‌-19) మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే దాని మూలాలు కనిపించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని వైద్యనిపుణులు తేల్చి చెబుతున్నారు. 

అనవసరంగా జనం కరోనాపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యాధికారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్‌ కేసుల రికార్డులను పరిశీలిస్తే పాజిటివ్‌ వచ్చినవారంతా చైనా, దుబాయ్‌, హాంకాంగ్‌ వాటి పొరుగు దేశాలకు వెళ్లి వచ్చిన వారే. కరోనా లక్షణాలు కూడా విదేశాలకు వెళ్లివచ్చినవారిలోనే కనిపిస్తున్నాయని వైద్యాధికారులు తెలిపారు. విదేశాలకు వెళ్లివచ్చిన వారికి మినహా కనీసం వారితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులకు గాని, తోటి ఉద్యోగులకుగాని కరోనా లక్షణాలు, పాజిటివ్‌ వచ్చిన దాఖలాలు దేశంలో ఎక్కడకూడా కనిపించలేదని గాంధీ జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాజారావు స్పష్టం చేశారు.  ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే విదేశాలకు వెళ్లివచ్చిన ప్రయాణికుల కుటుంబ సభ్యులతో పాటు వారు సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేషన్‌లో ఉంచడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 


విదేశీ ప్రయాణికులకే పరీక్షలు ..  విదేశాలకు వెళ్లివచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి మాత్రమే కొవిడ్‌-19పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డా.రాజారావు స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకా రం ఇతరులకు ఈ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పటి వరకు గాంధీ దవాఖానలో 193మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వారిలో మొత్తం 184మందికి నెగెటివ్‌ వచ్చిందని మరో 9మందికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టు రావల్సి ఉందన్నారు. 


 జలుబు, జ్వరం ఉంటే భయం వద్దు.. 

విదేశీ ప్రయాణికులు, వారితో సన్నిహితంగా ఉన్న వారు మినహాసాధారణ ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నంత మాత్రాన ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదు. గతంలో జలుబు, జ్వరం వస్తే ఎలా ట్రీట్‌మెంట్‌ తీసుకున్నామో అదేవిధంగా జనరల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే సరిపోతుంది. కొవిడ్‌-19 విజృంభించిన దేశాలకు వెళ్లి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు మాత్రమే జలబు, జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటి వరకు అలాంటి వారికే కొవిడ్‌-19పరీక్షలు చేయడం జరుగుతుంది. ముందుజాగ్రత చర్యల్లో భాగంగా ప్రజలు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, కరచాలనానికి దూరంగా ఉండడం, జనావాల్లోకి వెళ్లినప్పుడు మూత


logo