సోమవారం 06 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 01, 2020 , 04:21:29

322 కి.మీ.. 3 రోజులు

 322 కి.మీ.. 3 రోజులు
  • మార్చి 11న విజయవాడలో ప్రారంభం
  • రక్తదానంపై అవగాహన కల్పించేందుకు మారథాన్‌ రన్నర్‌ విజయ్‌ యార్గల్‌ కొత్త పంథా..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  ‘విజయవాడలోని ఓ ప్రధాన రోడ్డుపై యాక్సిడెంట్‌ జరిగింది. అందులోని ఒక వ్యక్తికి అత్యవరంగా రక్తం కావాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న మరో వ్యక్తి..  దవాఖానకు హుటాహుటిన బయలుదేరాడు. కానీ అక్కడికి చేరుకునే లోపు  ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సమయానికి రక్తం అందితే ఆ వ్యక్తి బతికేవాడని వైద్యులు తెలిపారు.’

 ఈ ఘటన ఆ వ్యక్తిని ఎంతగానో బాధించింది. రక్తదానంపై అవగాహన లేక జనాలు ముందుకు రాకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పంగా పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. అతడి పేరు విజయ్‌ యార్గల్‌. మారథాన్‌ రన్నర్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి. ‘రక్తదానం చేద్దాం.. ప్రాణాన్ని నిలబెడుదాం’ ఇది అతడి నినాదం. అందుకోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు.. ప్రస్తుతం మరొక సాహసానికి పూనుకున్నాడు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 322 కిలోమీటర్ల దూరం పరుగెత్తడానికి సిద్ధమయ్యాడు.  రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్ధ్దేశ్యంగా  నడుం బింగించాడు..


పరుగు ఇలా.. !

మార్చి 11 బుధవారం రోజున ఉదయం 7 గంటలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి విజయ్‌ యార్గల్‌ పరుగు ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు పరుగు ఉంటుంది. మార్చి 14న ఉదయం 7గంటలకు హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చేరుకుంటారు. మొత్తంగా 322 కిలో మీటర్లు.  ఒక్క రోజుకు కనీసం 100 కిలో మీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది. ఎక్కడా ఆగకుండా పరుగెత్తుతేనే లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో చేరుకోలడు. గతంలో మారథాన్‌ (21కి.మీ), ఫుల్‌ మారథాన్‌ (42)కిలో మీటర్లును దాటగలిగిన అనుభవం అతడిది. అయితే ప్రస్తుతం రక్తదానం విలువ తెలుపడానికి సాహసోపేత పరుగుకు విజయ్‌ సిద్ధమవడంపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వల్లువెత్తుతున్నాయి. ఈ పరుగుకు హైదరాబాద్‌, విజయవాడ మారథాన్‌ సంస్థలు తమ మద్దతును తెలిపాయి. పరుగు ప్రారంభం నుంచి విజయ్‌ వెంట ఐదుగురు ఉంటారు. అయితే వారు మధ్య మధ్యలో జత కలుస్తూ ఉంటారు. విజయ వాడ నుంచి 15 మంది రన్నర్స్‌ సూర్యపేట వరకు జత కలుస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ రన్నర్స్‌ 15 మంది కేబీఆర్‌ పార్క్‌ వరకు ఉంటారు. ఈ పరుగుకు సంబంధించి ఇప్పటికే పోలీసు, వైద్యుల అనుమతి తీసుకున్నారు. విజయ్‌ అండ్‌ టీం వెంట ఎమర్జెన్సీ వెహికిల్‌ అందుబాటులో ఉంటుంది. 


రక్తదానం చేయడానికి అందరూ ముందుకు రావాలి

మన కండ్ల మందే ఎంతో మంది ప్రమాదాల్లో మృతిచెందుతున్నారు. అందులో కొందరూ సమయానికి రక్తం అందక.. ఇది చాలా విచారకరం. వారిని మనం కాపాడుకోవచ్చు. రక్తదానం చేస్తే వారికి ప్రాణం ఇచ్చినవాళ్లమవుతాం. అందుకే రక్తదానంపై అవగాహన కలిగించడానికే 322కిలోమీటర్ల పరుగుకు సిద్ధమయ్యా. రక్తదానం చేయాలనుకునే వాళ్లు givered.inలో సభ్యులుగా చేరొచ్చు.

- విజయ్‌ యార్గల్‌, అల్ట్రా మారథాన్‌ రన్నర్‌ logo