సోమవారం 30 మార్చి 2020
Rangareddy - Feb 29, 2020 , 03:04:02

50 థీమ్‌ పార్కులు 120 కోట్లతో ఏర్పాటు

50 థీమ్‌ పార్కులు 120 కోట్లతో ఏర్పాటు
  • 7.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో పచ్చదనం పరుచుకునేలా కసరత్తు
  • ప్రణాళికలు సిద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ ఏర్పాటు అనంతరం అత్యంత భారీస్థాయిలో థీమ్‌ పార్కుల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.120కోట్ల వ్యయంతో 50 చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు కార్యప్రణాళికను సిద్ధం చేశారు. 7.50 లక్షల చదరపు మీటర్లలో వీటిని నెలకొల్పాలని నిశ్చయించారు. ఇప్పటికే ఆయా పార్కుల్లో ఏర్పాటు చేసే థీమ్‌లను నిర్ధారించిన అధికారులు వాటి నమూనాలను రూపొందించే పనిలో ఉన్నారు. త్వరలోనే నమూనాలు సిద్ధం చేసి వచ్చే మార్చి నుంచి వరుసగా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జీహెచ్‌ఎంసీ ఆరు చోట్ల థీమ్‌ పార్కులను అందుబాటులోకి తెచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయం విదితమే. 33 శాతం గ్రీన్‌ కవర్‌ సాధించడమే లక్ష్యంగా పెద్దఎత్తున మొక్కలు నాటుతుండగా, ఇదే క్రమంలో జీహెచ్‌ఎంసీ భారీస్థాయిలో థీమ్‌ పార్కులను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో థీమ్‌లను నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపడుతామని అధికారులు తెలిపారు. జోన్లవారీగా పనులు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా మొత్తం 50 పార్కులు దశలవారీగా అందుబాటులోకి వస్తాయని భరోసా ఇచ్చారు. మరోవైపు, జీహెచ్‌ఎంసీ నిధులతో ప్రతిఏటా చేపట్టే పార్కుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ఏర్పాటు తరువాత ఆరు ప్రాంతాల్లో థీమ్‌ పార్కులను ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లిలో డాగ్‌ పార్కు, పంచతంత్ర పార్కు, మలక్‌పేట్‌లో దివ్యాంగుల పార్కు, జూబ్లీహిల్స్‌లో ఫ్రూట్‌ పార్కు, మీరాలంలో లేక్‌ పార్కు, కిషన్‌బాగ్‌ పార్కు తదితర వాటిని ఏర్పాటు చేశారు. 


పార్కు ప్రాంతం                 విస్తీర్ణం(చ.మీ.లలో)    థీమ్‌   ఎల్బీనగర్‌ జోన్‌...

1. ఏఎస్‌రావు నగర్‌, శాంతినికేతన్‌ స్కూలు            7549                        ట్రాఫిక్‌

2. చర్లపల్లి, బీఎన్‌రెడ్డినగర్‌           12202                     ఎనర్జీ కన్వెన్షన్‌

3. చర్లపల్లి, ఈసీనగర్‌           4930                     ది ప్యాట్రియాటిక్‌ 

4. వాసవీ ఎన్‌క్లేవ్‌, కాప్రా సర్కిల్‌           5642                     స్కల్పర్‌ పార్క్‌

5. బండబావి, నర్సరీ వద్ద కాప్రా సర్కిల్‌          19568                  నాలెడ్జ్‌ పార్క్‌

6. సంజీవయ్య పార్కు, మల్లాపూర్‌          10816                    స్వచ్ఛత టెంపుల్‌ పార్క్‌

7. ప్రగతినగర్‌, ఉప్పల్‌          1935                    హెర్బల్‌ పార్క్‌(వృద్ధుల పార్కు)

8. ఆనమ్‌గల్‌ పార్క్‌, హయత్‌నగర్‌          2200                    స్వచ్ఛత టెంపుల్‌ పార్కు

9. టీచర్స్‌కాలనీ, ఎల్బీనగర్‌ సర్కిల్‌         4880                    ఉమెన్స్‌ థీమ్‌ పార్కు

10. సచివాలయనగర్‌, ఎల్బీనగర్‌ సర్కిల్‌         4120                    తెలంగాణ కాన్సెప్ట్‌ థీమ్‌

11. సాహెబ్‌నగర్‌, ఎల్బీనగర్‌ సర్కిల్‌         8000                    వాటర్‌ కన్జర్వేషన్‌ థీమ్‌ పార్కు

12. ఇంద్రప్రస్థ కాలనీ, సర్కిల్‌-4         3051                    స్కేర్డ్‌ థీమ్‌ పార్క్‌

13. సరూర్‌నగర్‌, హుడాకాలనీ                         6380                    చిల్డ్రన్‌ థీమ్‌ పార్క్‌

మొత్తం        91273


     చార్మినార్‌ జోన్‌...

14. శాలివాహన నగర్‌, మూసారామ్‌బాగ్‌       7000         స్వచ్ఛతా థీమ్‌

15. రాజేంద్రనగర్‌, జనచైతన్య కాలనీ      11500        వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌

16. రాజేంద్రనగర్‌, గోల్డెన్‌హైట్స్‌ కాలనీ       8000             అడ్వెంచర్‌ థీమ్‌

మొత్తం     26500


   శేరిలింగంపల్లి జోన్‌..

17. ప్రతీకనగర్‌, మాదాపూర్‌ 5300  సైన్స్‌ థీమ్‌ పార్కు

18. నల్లగండ్ల హుడా లేఔట్‌-2    18055 స్వచ్ఛతా థీమ్‌ పార్క్‌

19. నల్లగండ్ల రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌    17542  స్వచ్ఛతా థీమ్‌ పార్క్‌

20. టీఎన్‌జీఓ కాలనీ, శేరిలింగంపల్లి              18500            పెంగ్‌ సుయ్‌ పార్క్‌

21. నల్లగండ్ల హుడా లేఔట్‌-21                 8000               ట్రాఫిక్‌ థీమ్‌ పార్క్‌

22. నల్లగండ్ల హుడా లేఔట్‌-10               21728            స్పెషల్‌ నీడ్స్‌ థీమ్‌ పార్క్‌

23. మియాపూర్‌ మయూరీనగర్‌                17440           ఎంజీఎన్‌ థీమ్‌ పార్క్‌

24. హఫీజ్‌పేట్‌ మాతృశ్రీనగర్‌                    13945           బౌన్స్‌ థీమ్‌ పార్క్‌

25. చందానగర్‌ వెంకటేశ్వర కాలనీ               21382           వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్క్‌

మొత్తం                                                  141892


    కూకట్‌పల్లి జోన్‌..

26. కేపీహెచ్‌బీ వసంతనగర్‌ మేజర్‌ పార్క్‌         16188           వాటర్‌ హార్వెస్టింగ్‌ పార్క్‌

27. కేపీహెచ్‌బీ నాల్గవ ఫేజ్‌ బస్టాప్‌ పార్కు         6070     స్వచ్ఛతా పార్కు

28. కేపీహెచ్‌బీ ఏడవ ఫేజ్‌ పార్కు                    4047    స్వచ్ఛతా పార్క్‌

29. ముళ్లకత్వ చెరువు కేపీహెచ్‌బీ                   80940       యూనివర్సల్‌ వాటర్‌ థీమ్‌ పార్కు

30. దండమూడి కాలనీ      8094         చిల్డ్రన్‌ పార్కు

31. టీఎస్‌హెచ్‌సీ పార్కు         8094         అర్బన్‌ పార్కు

మొత్తం                                                     26305


ఖైరతాబాద్‌ జోన్‌...

32. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యేకాలనీ            9978       సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ 

33. బంజారాహిల్స్‌, రోడ్‌ నం-12 మిథిలానగర్‌  9183        స్వచ్ఛతా థీమ్‌

34. జూబ్లీహిల్స్‌, రోడ్‌ నం-86, ఫిల్మ్‌నగర్‌త                    137733   రాక్‌ గార్డెన్‌

35. జూబ్లీహిల్స్‌ రోడ్‌నం-51                              72846      అడ్వెంచర్‌ థీమ్‌ పార్క్‌

36. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-10,             48564       హెర్బల్‌ గార్డెన్‌

37. ప్రశాసన్‌నగర్‌, జూబ్లీహిల్స్‌             34949       ఉమెన్‌ పార్క్‌

38. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం- 25             34400       కాళేశ్వరం ప్రాజెక్టు థీమ్‌

39. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-74, 75               25351       వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌

40. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం- 32                 14861       నాలెడ్జ్‌ పార్క్‌

41. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-36, రెయిన్‌బో గార్డెన్స్‌ 14529      చిల్డ్రన్‌ పార్క్‌

42. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-32                    11653      తెలంగాణ కల్చర్‌ పార్కు

43. దస్‌పల్లా హోటల్‌, జూబ్లీహిల్స్‌రోడ్‌నం-37          10939   వేస్ట్‌టూవండర్స్‌ఆఫ్‌తెలంగాణ  

44. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-1, 92                 10353 ఎనర్జీ కన్వెన్షన్‌ పార్కు

మొత్తం  435338


    సికింద్రాబాద్‌ జోన్‌..

45. అడిక్‌మెట్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌  3000       ట్రాఫిక్‌ ఎవేర్‌నెస్‌ థీమ్‌

46. యాప్రాల్‌ కల్యాణ్‌ సులోచన ఎన్‌క్లేవ్‌      8000      స్వచ్ఛతా పార్క్‌

47. యాప్రాల్‌ జేజే నగర్‌                         5000       జురాసిక్‌ పార్క్‌

48. యాప్రాల్‌ శ్రీకృషి ఎన్‌క్లేవ్‌                  5000        ప్యాట్రియాటిక్‌ థీమ్‌

49. యాప్రాల్‌ షాయిలీ గార్డెన్స్‌    4300        స్వచ్ఛతా థీమ్‌

50. యాప్రాల్‌ జీకే హైట్స్‌  4100       వాటర్‌హార్వెస్టింగ్‌ థీమ్‌

మొత్తం                                                                           29400

అన్ని జోన్లు కలిపి మొత్తం        750709  విస్తీర్ణం(చ.మీ)


ఇదివరకే సిద్ధమైన థీమ్‌ పార్కులు

 శేరిలింగంపల్లిలో డాగ్‌ పార్కు

 కిషన్‌బాగ్‌ పార్కు  

 మీరాలం లేక్‌ పార్కు

శేరిలింగంపల్లి పంచతంత్ర పార్కు

మలక్‌పేట్‌ దివ్యాంగుల పార్కు

జూబ్లీహిల్స్‌ రోడ్‌నం- 36, ట్రాన్సిట్‌  పార్క్‌,  ఫ్రూట్‌ థీమ్‌


logo