సోమవారం 30 మార్చి 2020
Rangareddy - Feb 28, 2020 , 03:35:24

అక్రమ లేఅవుట్లను ఉపేక్షించం

అక్రమ లేఅవుట్లను ఉపేక్షించం
  • ఈఓపీఆర్డీ మధుసూదనాచారి, ఎంపీఓ వినోద్‌కుమార్‌
  • రెండోరోజు కొనసాగిన కూల్చివేతల పర్వం

 మంచాల : మండలంలోని వివిధ గ్రామాల్లో ఎలాంటి  అనుమతులు తీసుకోకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను ఈఓపీఆర్డీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో శుక్రవారం కూల్చివేశారు.  మండలంలోని నోముల గ్రామంలో  ఆరు అక్రమ వెంచర్లను జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్డీ మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లను కూల్చివేయాలని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నట్లు తెలిపారు.  నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు. 

యాచారం: మండలంలోని గున్‌గల్‌ గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా  ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లను మండల పంచాయతీ అధికారి వినోద్‌కుమార్‌ ఆధ్వర్యలో అధికారులు గురువారం కూల్చివేశారు. పంచాయతీ కార్యదర్శులు డోజర్‌ సహాయంతో  వెంచర్‌ను కూల్చివేసి, రోడ్లను ద్వంసం చేశారు, హద్దురాళ్లను తొలగించి పంచాయతీ కార్యాలయాలనికి తరలించారు. ఈసందర్భంగా ఎంపీఓ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా  వెంచర్లను ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. అక్రమ వెంచర్ల నిర్వాహకులపై 2018పంచయతీ రాజ్‌ చట్టం ప్రకారం చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో ఏర్పాటు చేసిన ప్రతి వెంచర్‌కు అనుమతులు తప్పనిసరి అన్నారు. 


logo