బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 26, 2020 , 00:56:49

డయల్‌ 100కు టైంపాస్‌ కాల్స్‌

డయల్‌ 100కు టైంపాస్‌ కాల్స్‌
  • 55 రోజుల్లో మొత్తం వెయ్యి రాంగ్‌కాల్స్‌
  • ప్రతి కాల్‌ను అటెండ్‌ చేసిన పోలీసులు..
  • రాత్రి సమయాల్లోనే అధికం
  • మద్యం మత్తులో తప్పుడు సమాచారం...
  • ఇక నుంచి రిపీటెడ్‌ ఫేక్‌ కాల్స్‌ చేస్తే... బ్లాక్‌ ఆప్షన్‌ను ఉపయోగించనున్న కాప్స్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మనకు మూడు నాలు గుసార్లు తప్పుడు కాల్స్‌ వస్తే వాటికి సమాధానం ఇవ్వడానికి ఎంత చిరాకు కలుగుతుందో అందరికీ తెలుసు. అలా నిరంతరం వస్తుంటే ఎంత మానసిక ఒత్తిడికి గురవుతామో, ఆ బాధ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ వెయ్యిసార్లు చేస్తే ఆ కాల్స్‌ను తట్టుకోగలమా...కానీ పోలీసులు సహనంతో వాటికి స్పంది స్తూ వారు చెప్పిన వివరాలను నోట్‌ చేసుకుని ఆ సమాచారం ఇచ్చిన చోటుకు వెళ్లి వచ్చిన సమాచారం నకిలీనా లేదా అసలేనానని నిర్ధారించుకుంటున్నారు. ఇలా 55రోజుల్లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో డయల్‌ 100కు దాదాపు వెయ్యి ఫోన్‌కాల్స్‌ తప్పుడు సమాచారానికి సంబంధించినవి ఉండడం గమనార్హం. కానీ పోలీసులు ఏనాడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి సమాచారానికి హాజరై అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు.


ఆ తర్వాత తమపై అధికారులకు ఫోన్‌కాల్‌ సమాచారం వచ్చింది ఫేక్‌ అని రిపోర్టు చేస్తారు. కానీ ఏ రోజు కూడా ఇది ముందస్తుగానే ఫేక్‌కాల్‌ అని అనుకోకుండా వారు ఇచ్చే సమాచానికి స్పందించారు. ముఖ్యంగా ఫేక్‌కాల్స్‌ అని నిర్ధారించుకోవడానికి పోలీసులకు కొన్ని సందర్భాల్లో గంటల తరబడి సమయం పడుతుంది. దానిని ప్రత్యక్షంగా రుజువు చేసుకునే వరకు పోలీసుల కలవరం, టెన్షన్‌ హైస్పీడ్‌లో కొనసాగుతుంది. సమాచా రం ఇస్తే పోలీసులు రాలేదనే ఫిర్యాదు కూడా వెదికినా దొరకదు. ఇతర అత్యవసర విధుల్లో ఉన్న ఆ సంబంధిత సెక్టార్‌కు వచ్చిన సమాచారాన్ని నిర్ల క్ష్యం చేయకుండా కొద్దిగా ఆలస్యమైన కచ్చితంగా మాత్రం పోలీసులు హాజరై ఆ ఫిర్యాదును పరిశీలిస్తారు. కానీ బాధ్యతగా మనం కూడా ఒకసారి ఆలోచించి పోలీసులను పరేషాన్‌ చేయకుండా ఫేక్‌ కాల్స్‌ చేయకుండా వ్యవహరించాలని పో లీసులు కోరుతున్నారు.


ఇక బ్లాక్‌ ఆప్షన్‌...

పోలీసులకు డయల్‌ 100లో వస్తున్న ఫేక్‌ కాల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి నివారించేందుకు ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండడంతో డయల్‌ 100కు ఫోన్‌ చేసే వారి లొకేషన్‌ కూడా పోలీసులకు తెలిసిపోతుంది. ఇక తాజాగా పోలీసులు ఫేక్‌ కాల్స్‌కు సంబంధించిన చిట్టాను సేకరించి ఒకే నంబరు నుంచి దాదాపు 6 నుంచి 10ఫోన్‌ కాల్స్‌ ఫేక్‌ తేలితే ఇక ఆ ఫోన్‌ నంబరును బ్లాక్‌ ఆప్షన్‌లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు వచ్చే ఫోన్‌ కాల్స్‌ మద్యం సేవించి తప్పుడు సమాచారం ఇచ్చే వారు ఎక్కువగా ఉంటారని పోలీసుల అధ్యయనంలో తేలింది. దీనికి తోడు అదే సమాచారంపై అదే వ్యక్తి తరుచుగా ఫోన్‌ చేస్తుండడం పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తుంది. వీటన్నింటినీ నియంత్రించేందుకు పోలీసులు ఉన్నతాధికారులు అలాంటి రిపీటెడ్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేసేందుకు ప్రత్యేక ఆప్షన్‌ను సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.


సార్‌ ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది..

సాధారణంగా పోలీసులకు మద్యం మత్తులో వచ్చే ఫోన్‌ కాల్స్‌ చాలా ఆందోళన కలిగించే విధంగా ఉంటా యి. ఇటీవల ఓ ఫోన్‌ కాల్‌కు సంబంధించి...సార్‌ మా మల్కాజిగిరి పరిధిలో ఓ పెద్ద గొడవ అవుతుంది... రెండు గ్యాంగ్‌లు మారణాయుధాలతో కొట్టుకుంటున్నారు. తొందరగా రావాలంటూ సమాచారం ఇచ్చా డు. తీరా అక్కడికి వెళ్లిచూశాక ఓ మద్యం షాపు వద్ద ఇద్దరు మత్తులో అరుచుకుంటున్నారు. తీరా ఆ దృశ్యా న్ని చూసి పోలీసులు ఊపిరీ పీల్చుకున్నారు.


మధ్యాహ్న సమయాల్లో కూడా...

మధ్యాహ్నసమయాల్లో కూడా పోలీసులకు పిల్లల నుం చి కాల్స్‌ వస్తుంటాయి. చాలా సందర్భాల్లో  పిల్లలు డయల్‌ 100ను నొక్కడం వల్ల ఆ కాల్‌ వస్తుంది. కానీ ఎవరు మాట్లాడరు. అప్పుడు పోలీసులు హలో.... హలో... అంటూ మొత్తుకున్నా అటువైపు నుంచి ఏమి సమాధానం ఉండదు. ఇలా కట్‌ చేయకుండా కొన్ని నిమిషాలు లైన్‌లో ఉంటారు. తర్వాత ఎవరైనా గమనించి సార్‌ సారీ మాపాప ఆడుకుంటూ నొక్కేసిందని సమాధానం వస్తుంది. కానీ పోలీసులకు హై టెన్షన్‌ ఫోన్‌ చేసి మాట్లాడకపోవడం ఆ సందర్భంలో వివిధ రకాల శబ్ధాలు, కేకలు, మాటలు వినిపించి వినిపంచనట్లు ఉండడంతో ఇదేమైనా కిడ్నాప్‌ సంబంధించిం దా, లేదా ఇంకా ఏమైనా పెద్ద గొడవకు సంబంధించిం దా, లేదా ఎవరైనా మహిళను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నారా అనే ఆలోచనలు పోలీసుల మదిలో తిరుగుతుంటాయి. అసలు విషయం తెలుసుకుని కూల్‌అవడం పోలీసుల వంతవుతుంది. logo