సోమవారం 30 మార్చి 2020
Rangareddy - Feb 26, 2020 , 00:51:52

‘మీ వద్దకే కేంద్ర జీఎస్‌టీ’

‘మీ వద్దకే కేంద్ర జీఎస్‌టీ’

మన్సూరాబాద్‌ : వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రిటర్న్‌ దాఖలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులతో పాటు పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం రంగారెడ్డి కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ‘ జిల్లా జిల్లాలో కేంద్ర జీఎస్‌టీ మీ వద్దకు’ కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీనగర్‌, రాక్‌టౌన్‌కాలనీలోని గోటేటి ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన అవగాహన   సదస్సుకు కేంద్ర జీఎస్‌టీ చీఫ్‌ కమిషనర్‌ శ్రీవాస శేషగిరిరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచనల మేరకు, పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ జిల్లాల్లోని అన్ని కేంద్రాలలో మంగళవారం నుంచి మార్చి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జీఎస్‌టీ కమిషనర్‌ కేసీ జానీ, అడిషనల్‌ కమిషనర్లు బాలకిషన్‌ రాజు, వెంకయ్య చౌదరి, డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు రాంబాబు, సురేశ్‌, వివిధ రంగాలకు చెందిన వ్యాపారస్తులు, వాణిజ్య, పారిశ్రామిక రంగ ప్రతినిధులు, కన్సల్టెంట్స్‌, ఆడిటర్స్‌ తదితరులు పాల్గొన్నారు.


logo