మంగళవారం 31 మార్చి 2020
Rangareddy - Feb 23, 2020 , 00:21:55

ఆలోచనలు..అన్వేషణలు..ఆవిష్కరణలు..

ఆలోచనలు..అన్వేషణలు..ఆవిష్కరణలు..
  • ఉత్సాహంగా సాగిన ఇన్నోవేషన్‌ యాత్ర

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలివి.. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తుకాదు. కాసింత ప్రయత్నం.. మరికాసింత జిజ్ఞాన.. నిరంతర సాధన ఉంటే రాణించగలం. అక్షరం ముక్కరాకపోయినా దేనినైనా అలవోకగా సాధించగలం. ఇలాంటి వారే 21వ శతాబ్దపు హీరోలుగా నిలుస్తున్నారు. ప్రపంచంతో పోటీపడాలన్నా తపనతో అంచలంచెలుగా ఎదుగుతున్నారు. మేధస్సును పెట్టుబడిగా పెట్టి శ్రమను నమ్ముకుని సాగిపోతున్నారు. పద్మశ్రీ చింతకింది మల్లేశం, వనజీవి రామయ్యలాంటి వాళ్లెంతమందో ఇదే కోవకు చెందిన వారే. తెలంగాణను ఇన్నవేషన్‌ రాష్ట్రంగా రూపుదిద్దాలన్న ఆలోచనతో ప్రభుత్వం నూతన స్టార్టప్‌లను ప్రొత్సహిస్తూ, కొత్త ఆలోచనలకు సరికొత్త వేదికను కల్పిస్తున్నది. ఔత్సాహిక ఆవిష్కర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రపంచానికి పరిచయం చేస్తున్నది.


ముఖ్యంగా కళాశాల విద్యార్థుల్లో దాగిఉన్న ప్రభతిను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాంగా తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ఇన్నవేషన్‌ యాత్రను నిర్వహించింది. గద్వాల్‌ - హైదరాబాద్‌, నిజామాబాద్‌ - హైదరాబాద్‌, ఖమ్మం - హైదరాబాద్‌, వరంగల్‌ - హైదరాబాద్‌ రూట్లల్లో నాలుగు రోజుల పాటు సాగిన ఈ యాత్ర శనివారంతో ముగిసింది. మొత్తం 120 మంది విద్యార్థులు ఈ యాత్రలో పాల్గొనగా, ఒక్కో రూట్లో 30 మంది చొప్పున విద్యార్థులను ఎంపికజేసి యాత్రలో భాగస్వామ్యం చేశారు. శనివారం గచ్చిబౌలిలోని టీహబ్‌లో నిర్వహించిన యాత్ర ముగింపు కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌. ప్రొ. తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రొ. లింబ్రాద్రి, ప్రొ. వెంకరమణ, రామఅయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గైడ్‌లు తమ అనుభవాలను పంచుకున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే..


logo
>>>>>>