గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 22, 2020 , 03:11:08

శంభో శివ శంభో.. శివశివ శంభో

శంభో శివ శంభో.. శివశివ శంభో

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ: శివరాత్రి మ హా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమనగల్లు బ్లాక్‌ మండలాల్లో ఉన్న శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. మండలంలోని అయ్యసాగర్‌ క్షేత్రం, రామేశ్వరం, కడ్తాల్‌ మండలంలోని మైసిగండి కాశీవిశ్వనాథస్వామి ఆలయం, తలకొండపల్లి మండలంలోని మల్లప్పగుట్ట దేవాల యం, మాడ్గుల మండలంలో పలు గ్రామాల్లో వెలిసిన శివాలయాలకు ప్రత్యేకపూజలు నిర్వహించేందుకు భక్తులు ఉదయం నుంచి తరలివచ్చారు.  మల్లప్పగుట్ట దేవాలయం, అయ్యసాగర్‌ క్షేత్రం ఆవరణలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తోపాటుగా పలువురు ప్రజాప్రతినిధు లు పూజలుచేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేపట్టారు.

చౌదర్‌పల్లిలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

తలకొండపల్లి: మండల పరిధిలోని చౌదర్‌పల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో పురోహితులు యజ్ఞం, అర్చనలు అభిషేకాలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. గ్రామానికి చెందిన మహిళలతోపాటు వివిధ గ్రామాలకు చెందిన వారు ధ్వజస్తంభానికి ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి విచ్చేసి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, సర్పంచ్‌ చంద్రయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌, ప్రదీప్‌రెడ్డి, వెంకటయ్య, నర్సింహ, రవి, దశరథం, యా ద య్య, శేఖర్‌, తిరుపతయ్య, మల్లేశ్‌, వెంకటేశ్‌, యాదగిరి పాల్గొన్నారు.

మాడ్గులలో...

మహా శివరాత్రి పండుగ సందర్భంగా శుక్రవారం మండలంలోని శివాలయాల్లో భక్తులు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆర్కపల్లిలోని శ్రీశ్రీశ్రీ కాశీవిశ్వేశ్వర వీరాంజనేయస్వామి దేవాలయంలో మండపారాదన, స్వస్తివాచకం, హోమం, శివపార్వతులకు అభిషేకం నిర్వహించారు. నాగిళ్ళలో రామేశ్వర దేవాలయం, పెద్దమాడ్గులలోని శివాలయంలో, అప్పారెడ్డిపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న శివాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పం చ్‌ జంగయ్య, మోహన్‌రావు, ఏపీ జంగయ్య, నర్సింహగుప్తా, శ్రీనివాస్‌గౌడ్‌, శేఖర్‌గౌడ్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

చంద్రాయణపల్లిలో బొడ్రాయి పండుగ

చంద్రాయణపల్లిలో బొడ్రాయి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి వద్ద సర్పంచ్‌ యాదిరెడ్డి, కలకొండ ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి పూజలు చేశారు. కార్యక్రమంలో వెంకటయ్యగౌడ్‌, చంద్రయ్య, జంగయ్య, శంకర్‌ ఉన్నారు. 

ప్రతిచోటా పంచాక్షరి కొలువైయున్నారు 

కడ్తాల్‌: సృష్టిలో ప్రతిచోటా పంచాక్షరి కొలువైయున్నాడని బ్రహ్మకుమారి సుజాత అన్నారు. మ హాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మం డల కేంద్రంలోని శివాలయంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వనస్థలిపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య ఆధ్యాత్మిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. దేశంలోని 12 జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడాయనే విషయాలను శివుని గురించి భక్తులకు వివరించారు. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనదని, పంచామృతాలతో శివున్ని అభిషేకిస్తే అంతా మంచే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, రాజు, అనిల్‌, వెంకటేశ్‌, కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.  

కాశీవిశ్వనాథస్వామి బ్రహ్మోత్సవాలు 

మైసగండిలోని కొలువైన కాశీవిశ్వనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మూడోరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భం గా ఉదయం ఆలయ ఆవరణలో హోమాలు, స్వా మివారికి అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, ఆలయ ట్రస్టీ శిరోలీ, తహసీల్దార్‌ జ్యోతి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు మోత్యానాయక్‌, నర్సింహముదిరాజ్‌, శ్రీనివాస్‌రెడ్డి, హన్మానాయక్‌, వెంకటేశ్‌, మల్లేశ్‌గౌడ్‌, భాస్కర్‌నాయక్‌, అరుణ్‌కుమార్‌ అర్చకులు ఉన్నారు.

ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు

మండల పరిధిలోని ఏక్వాయిపల్లి, ముద్విన్‌ గ్రామాల సరిహద్దులోని మల్లన్నగుట్టపై వెలిసిన మల్లికార్జునస్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఏటా మల్లన్నగుట్టపై ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఉదయం శివలింగానికి అభిషేకం, అర్చనలు, పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఆలయంలో నిర్వహించిన పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సర్పంచ్‌ యాదయ్య, ఉప సర్పంచ్‌ వినోద్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు వీరయ్య, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్‌, నాయకులు గోపాల్‌, లక్ష్మయ్య, యాదయ్య, రాజు, జంగయ్య, మల్లేశ్‌, రాములు, ఆలయ నిర్వాహకులు వెంకటేశ్‌యాదవ్‌, ఏట్టయ్యయాదవ్‌  ఉన్నారు.

ఎంపీ రాములు పూజలు

మండలంలోని మైసిగండిని కాశీవిశ్వనాథస్వా మి ఆలయాన్ని శుక్రవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ఎం పీపీ ఆనంద్‌, ఆలయ ఈఓ స్నేహలత ఉన్నారు.

మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు 

తలకొండపల్లి: చుక్కాపూర్‌లోని మల్లప్పగుట్టపై వెలిసిన మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మూ డురోజులుగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు. కల్యాణోత్సవం కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి సామూహికవ్రతాలు చేశా రు. రాంపూర్‌లో శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు శివాలయాల్లో ఒక్కపొద్దులు విడిచారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, ఎంపీపీ నిర్మల, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, పాండురంగారెడ్డి, మల్లారెడ్డి, రాజశేఖర్‌, పెంటారెడ్డి ఉన్నారు. 


logo