గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 22, 2020 , 03:09:55

ప్రభుత్వ పథకాలపై ప్రచారం

ప్రభుత్వ పథకాలపై ప్రచారం

కీసర : ప్రభుత్వ పథకాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు తెలియజేసే విధంగా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం మహశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన జిల్లా కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ హయంలో అమలవుతున్న పథకాలు, ఆ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఈ స్టాల్స్‌లో దొరుకుతుందని అన్నారు. భక్తులకు జాతరలో సమాచారం అందించడం చాలా అభినందనీయమని ప్రభుత్వ వివిధ శాఖల అధికారుల పనితీరును ప్రశంసించారు.
logo
>>>>>>