సోమవారం 30 మార్చి 2020
Rangareddy - Feb 22, 2020 , 03:09:00

రేపు మాడ్గులలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పర్యటన

రేపు మాడ్గులలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పర్యటన

మాడ్గుల: మాడ్గుల వాసవీ ఫంక్షన్‌హాల్లో ఆదివారం జరిగే కల్లు గీత కార్మికులకు లైసెన్స్‌లు ఇచ్చే కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొంటున్నట్లు మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు జి.లాలయ్యగౌడ్‌, మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వారు మాడ్గులలో విలేకరులతో మాట్లాడుతూ గీత కార్మికులు లైసెన్స్‌లు లేకుండా కల్లు గీసే క్రమంలో చెట్లపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలుపోయినా, కాలు, చేతులు విరిగినా ప్రభుత్వ సహాయం అందక ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ లైసెన్స్‌ల బకాయి లు మాఫీ చేయడంతో మంజూరైన లైసెన్స్‌లను ఇచ్చేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ రాములుగౌడ్‌, ఎమ్మెల్యే జి.జై పాల్‌యాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి ఆదివారం రానున్నారని తెలిపారు. గీతకార్మికులు, మండల ప్రజాప్రతినిధు లు, పార్టీశ్రేణులు అధికసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటయ్య (చంటి), మండల టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.పవన్‌కుమార్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.


logo