శనివారం 28 మార్చి 2020
Rangareddy - Feb 21, 2020 , 03:35:45

బస్తీలపై ఆర్మీ కన్నెర్ర

బస్తీలపై ఆర్మీ కన్నెర్ర

కంటోన్మెంట్‌ (నమస్తే తెలంగాణ): బస్తీలపై ఆర్మీ కన్నెర్ర జేస్తోంది. పేద ప్రజల కనీస వసతుల కల్పనకు అడ్డుపడుతోంది.  ప్రతి వ్యక్తి జీవించేందుకు కనీస వసతులు కల్పిం చాలన్న విషయాన్ని ఆర్మీ అస్సలు పట్టించుకోవ డంలేదన్న విమర్శలు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ లో వినిపిస్తున్నాయి. పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చి కేంద్ర రక్షణ శాఖ స్థలాల్లో తలదాచుకుంటున్న పేదలపై జులుం ప్రదర్శిస్తోంది.ఆయా స్థలాల్లో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి సదు పాయాలను సైతం ఆర్మీ అధికారులు అడ్డుకుం టున్నారు.  ఈ నెల 10వ తేదీన ఏడో వార్డు పరిధిలోని చిన్న కమేళాలో రూ.4.5 లక్షల ఎమ్మెల్యే నిధులతో  ఏర్పాటు చేసిన పవర్‌ బోర్‌ వేల్‌ను ఆర్మీ అధికారులు సీజ్‌ చేయడం ఆందో ళనకు గురిచేస్తోంది. 


బస్తీల్లో భయం..భయం..   

దేశ భద్రతతోపాటు ఏదైనా విపత్తు సంభవించి నప్పుడు ఆర్మీ ప్రజలకు విశేష సేవలందిస్తోంది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను రక్షించడంతోపాటు వారికి కావాల్సిన మౌలిక వసతులను సమాకూరుస్తోంది. కానీ సికింద్రా బాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో మాత్రం రక్షణ స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలపై ఉక్కుపాదం మోపుతోంది. ఏళ్ల తరబడి నివసిస్తున్న బస్తీలను ఖాళీ చేయాలంటుంది.లేదంటే బస్తీల్లో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌ సరఫరా కల్పించకుండా అటంకాలు సృష్టిస్తోంది. ఇదే తరహాలో ఇటీవల చిన్న కమేళాలో వేసిన పవర్‌బోరును ఆర్మీ సీజ్‌ చేసింది.కాగా రాష్ట్ర సర్కారు రెండు స్కైవేలతో పాటు నూతన సచివాలయ నిర్మాణం, ఆర్మీ స్థలా ల్లో  ఉన్న బస్తీలకు రక్షణశాఖకు చెందిన  స్థలాన్ని భూబదాలయింపు కింద ఇవ్వాలని కోరింది. ఎమ్మెల్యే జి.సాయన్న సైతం బస్తీవాసులకు భూబదాలయింపు కోసం పలు మార్లు కేంద్ర రక్షణశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. సాయన్న అభ్యర్థన మేరకు మంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు  నాటి రక్షణశాఖ మంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మల సీతారామన్‌లను కలిసి స్థలా న్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


మచ్చుకు కొన్ని సంఘటనలు..

  • రక్షణ శాఖ స్థలాల్లో ఏర్పడిన బస్తీల్లో మౌలిక వసతుల కల్పనకు ఆర్మీ అడుగడుగున అడ్డుపడు తూనే ఉంది. ఇలా కంటోన్మెంట్‌లోని ప్రతి వార్డు లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దాదాపు కొన్ని బస్తీలు వందల ఏళ్ల క్రితం వెలిశాయి.  
  • ఐదో వార్డు పరిధిలోని 108బజార్‌లో కంటో న్మెంట్‌ బోర్డు పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మిస్తే ఆర్మీ అడ్డుకుంది. 
  • మూడవ వార్డు పరిధిలోని అంబేద్కర్‌ హాట్స్‌లో విద్యుత్‌ సరఫరాకు ఆర్మీ ఒప్పుకోవడం లేదు. ఇక్కడ తాత్కాలిక బయోటాయిలెట్లను బోర్డు ఏర్పాటు చేయగా, బస్తీవాసులు అనధికారికంగా తాగునీటి పైపులైన్‌కు నల్లాలను ఏర్పాటు చేసు కున్నారు. 
  • ఏడో వార్డులోని సాయిబాబా హాట్స్‌లో తాగు నీటి సరఫరా,డ్రైనేజీ, పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణా నికి అనుమతి ఇవ్వడంలేదు. 
  • ఆరవ వార్డు పరిధిలోని నందమూరినగర్‌ బస్తీలో ఏదైనా నిర్మాణం చేపడితే ఆర్మీ అడ్డుప డుతోంది.
  • రెండు, మూడు వార్డుల పరిధిలోని బలం రా యి, అన్నానగర్‌, రసూల్‌పురాలోనూ ఇదే పరిస్థితి కోనసాగుతోంది. 
  • తాజాగా చిన్న కమేళాలో ఎమ్మెల్యే సాయన్న తన నిధులతో పవర్‌బోర్‌వేల్‌  వేయిస్తే.. మరు సటి రోజునే ఆర్మీ ఆ బోర్‌ను సీజ్‌ చేసింది. 


తాడోపేడో తేల్చుకుంటా

బస్తీ ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని ఇప్పటికే పలుమార్లు ఆర్మీ అధికారులను కలిసి విన్నవించా. అయి నా లోకల్‌ మిలటరీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు.  బస్తీలు ఇప్పటికిప్పుడు వెలిసినవి కావు. వం దల ఏళ్ల నాటివి. అయినా మేము స్థలా బదాలయింపు సైతం కోరుతున్నాం. ఈ విషయాన్ని  ఆర్మీ బ్రిగేడియర్‌ దృష్టికి తీసుకువెళ్తాను. ప్రజల కోసం ఆర్మీతో తాడోపేడో తేల్చుకుకుంటా                            

-జి.సాయన్న, ఎమ్మెల్యే  logo