గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 20, 2020 , 00:22:30

కంటికి రెప్పలా ‘నిఘా’ టూల్‌

కంటికి రెప్పలా ‘నిఘా’ టూల్‌
  • కీసర బ్రహ్మోత్సవాల్లో భక్తుల రక్షణ కోసం సరికొత్త సాఫ్ట్‌వేర్‌
  • తొక్కిసలాట జరగకుండా ఎప్పటికప్పుడు క్షణాల్లో హెచ్చరికలు
  • 100 కెమెరాలు.. 24/7 పోలీసుల బందోబస్తు

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ:  కీసర గుట్ట బ్రహ్మోత్సవాలకు మొట్టమొదటి సారిగా నిఘా సాఫ్ట్‌వేర్‌ టూల్‌తో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏ చిన్న తొక్కిసలాట జరగకుండా, అవాంఛనీయ శక్తులు ఆ దరిదాపులో కనిపిస్తే తక్షణమే అల్లారం ఇచ్చే వ్యవస్థను రాచకొండ పోలీసులు ఏర్పాటు చేశారు. దీనికి తోడు 1050 మంది పోలీసులను మొహరించారు. ఇటీవల మేడారం జాతర తర్వాత పూర్తి స్థాయిలో ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ టూల్‌ను కీసర బ్రహ్మోత్సవాల్లో ప్రయోగిస్తున్నారు. కీసర దేవాలయం, పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.దాదాపు 20 స్క్రీన్‌లు ఉండే కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పోలీసులు 24/7 ప్రతి దృశ్యాన్ని వీక్షిస్తారు.


‘నిఘా సాఫ్ట్‌వేర్‌ టూల్‌' ప్రత్యేకతలు...

ఒక చదరపు అడుగులో ఎంత మంది ఉంటారు. ఆ సంఖ్య పెరిగితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని వెంటనే హెచ్చరిస్తుంది. ఈ సమాచారం పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అందుతుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్‌ వేర్‌ను సీసీకెమెరాలతో పాటు కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. ఇలా హెచ్చరిక రాగా పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని రద్దీని నియంత్రిస్తారు. తొక్కిసలాట అవకాశ ప్రాంతాన్ని కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ టూల్‌ అధికారులకు చూపిస్తుంది. పోలీసు డాటాబేస్‌లో 2 లక్షల ఫొటోలను తీసీ టూల్‌లో భద్రపర్చారు. దీంతో ఆ రెండు లక్షల్లో ఉన్న ఏ నిందితుడైన సరే ఆ ప్రాంతానికి వస్తే వెంటనే పోలీసులకు లొకేషన్‌ తో పాటు అతని చిత్రాన్ని చూపిస్తుంది. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యి అతనిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ టూల్‌కు మరో ప్రత్యేకతను కూడా జోడించారు .కీసర ప్రధాన దేవాలయం వద్దకు వచ్చే ప్రతి వాహన చిట్టా ఇందులో ఉం టుంది.అంతే కా కుండా చోరికి గురై ఫిర్యాదులు నమోదైన వాహనాలు నెంబర్లు ఇందులో ఉండడంతో చోరీ వాహనం అక్కడికి వచ్చిన వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది. అలా పోలీసులకు ఈ సాఫ్ట్‌వేర్‌ బైక్‌ దొంగలను కూడా పట్టిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ మరో అరుదైన సేవలను అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అదృశ్యమైన వ్యక్తుల రికార్డును ఇందులో పొందుపర్చారు. ఈ కారణంగా గతంలో తప్పిపోయిన వారు ఎవరైనా ఇక్కడికి వారి సమాచారాన్ని అందిస్తే వెంటనే సీసీ కెమెరాలపై ప్రత్యక్షం చేస్తుంది. దీంతో ఏండ్ల నుంచి తప్పిపోయిన వారు వారి కుటుంబాల చెంతకు చేరే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి. 


logo
>>>>>>