సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Feb 18, 2020 , 19:30:49

రైతులు పీఎం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పొందాలి

రైతులు పీఎం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పొందాలి
  • జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి

మొయినాబాద్‌: భూమి కలిగిన ప్రతి రైతు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పొందాలని, అందుకు బ్యాంక్‌లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చిలుకూ రు మహిళా ప్రాంగణం మహిళా సమాఖ్య భవనంలో డీఆర్‌డీఓ ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రిజ్వాన్‌తో కలిసి బ్యాంక్‌ ప్రతినిధులు, ఐకేసీ సిబ్బంది, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతు క్రాప్‌ లోన్‌ అకౌంట్‌ కలిగి ఉంటాడు తప్ప కిసాన్‌ క్రెడిట్‌ అనేది ఉంటుందనే విషయం చాలామందికి తెలియదన్నా రు. క్రాప్‌లోన్‌ కలిగిన ప్రతి రైతు బ్యాంక్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కిసాన్‌ కార్డు కూడా ఏటీఎం  లాగానే ఉంటుందన్నారు. దీని ద్వారా క్రాప్‌ లోన్‌ కలిగిన రైతులు లోన్‌ అమౌంట్‌ను కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వా రా దేశంలో ఎక్కడైనా డబ్బు డ్రా చేసుకునే వెసులుబా టు ఉంటుందన్నారు. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు వచ్చిన రైతులు/ కౌలు రైతులు తగిన పత్రాలు జత చేసి క్రాప్‌ లోన్‌ అకౌంట్‌ కోసం బ్యాంక్‌లో దరఖాస్తు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు దరఖాస్తు చేసుకోవడం కోసం పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, క్రాప్‌ లోన్‌ అకౌంట్‌ను జతపర్చాలన్నారు.


బ్యాంకులు రుణా లు ఇవ్వకుంటే అధిక మొత్తానికి అప్పులు తెచ్చుకుని ఇబ్బందులు పడుతుంటారన్నారు. అలాంటి వాటికి చెక్‌ పెట్టాలని వ్యవసాయ శాఖ భావిస్తుందన్నారు. పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల జాబితాను బ్యాంక్‌ల  ద్వారా  తీసుకుని దాని ఆధారంగా రైతులకు క్రెడిట్‌ కార్డులు జారీ చేయించడానికి దరఖాస్తులు పెట్టింయాలని, ఇందులో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు భాస్వాములు కావాలని సూచించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదారులు బ్యాంక్‌కు వెళ్లి కార్డులను ఆక్టివ్‌ చేసుకుని రుణాలు పొందేలా కృషి చేయాలన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు రైతులు పొందడానికి జిల్లాలో అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. క్రిడిట్‌ కార్డులు తీసుకునేలా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టేందుకు పంచాయతీ స్థాయిలో వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి, స్వయం సహాయక సంఘాల సభ్యులతో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.