శనివారం 28 మార్చి 2020
Rangareddy - Feb 18, 2020 , 02:20:47

సంతృప్తికరంగా... కడుపు నిండేలా..

సంతృప్తికరంగా... కడుపు నిండేలా..

పేదల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్‌ ద్వారా రూ.5కే భోజన సదుపాయం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకోని యూసుఫ్‌గూడ బస్తీలో ఆధునిక సదుపాయాలతో నూతనంగా అన్నప్రూర్ణ క్యాంటీన్‌ను సర్కిల్‌-19 ఉప కమిషనర్‌ రమేష్‌, కార్పొరేటర్‌ గుర్రం సంజయ్‌గౌడ్‌తో కలసి ప్రారంభించారు.

  • యూసుఫ్‌గూడ బస్తీలో‘అన్నపూర్ణ క్యాంటీన్‌'
  • నగరంలో మొట్టమొదటి భోజనశాల
  • సీఎం పుట్టినరోజు కానుకగా ప్రారంభించిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌

యూసుఫ్‌గూడ :  పేదల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్‌ ద్వారా రూ.5కే భోజన సదుపాయం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకోని యూసుఫ్‌గూడ బస్తీలో ఆధునిక సదుపాయాలతో నూతనంగా అన్నప్రూర్ణ క్యాంటీన్‌ను సర్కిల్‌-19 ఉప కమిషనర్‌ రమేష్‌, కార్పొరేటర్‌ గుర్రం సంజయ్‌గౌడ్‌తో కలసి ప్రారంభించారు.  అనంతరం కార్మికులతో కలసి భోజనం చేశారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 అన్నపూర్ణ క్యాంటీన్లు మంజూరయ్యాయని, రాష్ట్రంలో రైతుల కోసం సద్దిమూట, భోజనామృతం సర్కార్‌ దవాఖానల వద్ద రోగుల సహాయకులకు,పట్టణ ప్రాంతాల్లో అన్నపూర్ణ క్యాంటీన్‌ ద్వారా పేదల ఆకలి సీఎం కేసీఆర్‌ తీర్చుతున్నారన్నారు. అధికారులు టీఆర్‌ఎస్‌ డివిజన్‌ నాయకులు రాజ్‌కుమార్‌ పటేల్‌,నర్శింగ్‌దాస్‌, కల్యాణి, వార్డు కమిటీ సభ్యులు, హరే కృష్ణ మూమెంట్‌ ప్రతినిధులు  పాల్గొన్నారు. 


logo