శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Feb 16, 2020 , 23:53:44

గులాబీకి పట్టాభిషేకం

గులాబీకి పట్టాభిషేకం

ఎన్నికలేవైనా విజయ దుందుబి మోగిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార సంఘాల ఎన్నికల్లోనూ సత్తాచాటింది. శనివారం ఫలితాలు వెలువడగా, ఆదివారం జరిగిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికల్లో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది. అత్యధికంగా డైరెక్టర్లను గెలిచిన అన్ని స్థానాల్లో చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, వీరందరికీ రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

  • అట్టహాసంగా సొసైటీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు
  • జిల్లా వ్యాప్తంగా 37 సహకార సంఘాలు
  • 25 స్థానాల్లో చైర్మన్‌ పీఠాలు దక్కించుకున్న టీఆర్‌ఎస్‌
  • అన్ని చోట్లా ఏకగ్రీవాలే..
  • కేవలం ఐదు స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్‌
  • ఒక్క స్థానంలో బ్లాక్‌ ఫార్వర్డ్‌ గెలుపు
  • -కోరం లేక ఆరు సొసైటీల్లో చైర్మన్‌ ఎన్నిక వాయిదా

ఎన్నికలేవైనా విజయ దుందుబి మోగిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార సంఘాల ఎన్నికల్లోనూ సత్తాచాటింది. శనివారం ఫలితాలు వెలువడగా, ఆదివారం జరిగిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికల్లో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది. అత్యధికంగా డైరెక్టర్లను గెలిచిన అన్ని స్థానాల్లో చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, వీరందరికీ రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. గ్రామీణ జిల్లాలో మొత్తం 37 సొసైటీల్లో 25 చైర్మన్‌ పీఠాలను దక్కించుకోగా, కాంగ్రెస్‌ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. ఒక్క స్థానం బ్లాక్‌ ఫార్వర్డ్‌ దక్కించుకోగా, ఆరు సొసైటీల్లో కోరం లేక చైర్మన్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. సీఎం కేసీఆర్‌ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్దే తమ విజయానికి కారణమని, ఐదేండ్ల పాటు రైతు సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని కొత్త చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు.

- షాబాద్‌, నమస్తే తెలంగాణ


షాబాద్‌, నమస్తే తెలంగాణ: సహకార సంఘం ఎన్నికల్లో చైర్మన్ల పట్టాభిషేకం జోరుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 37 సొసైటీలకు ఆదివారం చైర్మన్ల ఎన్నికలు జరుగాల్సి ఉండగా, కోరంలేక ఆరింటిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగతా 31 స్థానాల్లో 25 టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులు చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ కేవలం ఐదు స్థానాలు, బ్లాక్‌ఫార్వడ్‌ ఒక్కస్థానం గెలుపొందాయి. ఆదివారం ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు చైర్మన్‌ అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన డైరెక్టర్లు అత్యధికంగా గెలుపొందిన 25 స్థానాల్లో చైర్మన్‌ ఎన్నికలకు ఒక్కొక్కరు మాత్రమే బరిలో ఉండడంతో ఏకగ్రీవమయ్యాయి. వీరితో పాటు వైస్‌ చైర్మన్లు సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు కొత్తగా ఎన్నికైన చైర్మన్లకు స్వీట్లు తినిపించి సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి రహదారులపై విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణలో ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ తప్ప ఇతర పార్టీలకు ఆవకాశం లేదని నాయకులు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను చైర్మన్లుగా, వైస్‌ చైర్మన్లుగా గెలిపించాయన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార ఎన్నికల్లోనూ వేగంగా దూసుకెళ్లింది. దీంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం ఏర్పడింది. 


టీఆర్‌ఎస్‌ 25 చైర్మన్‌ స్థానాలు కైవసం

జిల్లా వ్యాప్తంగా 37 సొసైటీల్లో 25 చైర్మన్లను టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకున్నది. ఈ స్థానాల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల రేసులో ఒక్కొక్కరు మాత్రమే బరిలోకి దిగారు. దీంతో ఎన్నిక లాంఛనమైంది. వైస్‌ చైర్మన్లు సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఎన్నికయ్యారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఐదేండ్లపాటు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కొత్త చైర్మన్లు చెబుతున్నారు. 


ఆరు స్థానాల్లో చైర్మన్‌ ఎన్నిక వాయిదా

జిల్లా వ్యాప్తంగా ఆరు స్థానాల్లో కోరం లేకపోవడంతో ఆదివారం జరుగాల్సిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. ఇందులో పోల్కంపల్లి, హయత్‌నగర్‌, చిన్నగోల్కొండ, మల్కారం, గుండాల, ముడిమ్యాల సొసైటీల్లో కోరం లేక ఎన్నికలు వాయిదా వేశారు. మళ్లీ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారనేది తేదీ ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు. ఆరు సొసైటీల్లో కూడా నాలుగు వరకు టీఆర్‌ఎస్‌ దక్కించుకోవడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 


పీఏసీఏస్‌ పేరు చైర్మన్‌         పార్టీ              వైస్‌చైర్మన్‌                    పార్టీ

తుర్కయాంజాల్‌ కె.సత్తయ్య       టీఆర్‌ఎస్‌               వెంకట్‌రెడ్డి          బీజేపీ                                                

బాటసింగారం విఠల్‌రెడ్డి       టీఆర్‌ఎస్‌               మల్లమ్మ             టీఆర్‌ఎస్‌

భాగ్యనగర్‌ నర్సింహారెడ్డి      టీఆర్‌ఎస్‌                బంగారి బాబు     కాంగ్రెస్‌

పటేల్‌గూడ మహేందర్‌రెడ్డి     టీఆర్‌ఎస్‌                 పాండురంగారెడ్డి   టీఆర్‌ఎస్‌

యాచారం రాజేందర్‌రెడ్డి      టీఆర్‌ఎస్‌                  యాదయ్య          టీఆర్‌ఎస్‌

ఆర్కే మైలారం వెంకట్‌రెడ్డి         టీఆర్‌ఎస్‌                 ఈశ్వర్‌               టీఆర్‌ఎస్‌

ఉప్పరిగూడ సుదర్శన్‌రెడ్డి     టీఆర్‌ఎస్‌                 శంకర్‌య్య         టీఆర్‌ఎస్‌

హైదర్‌షా కోట్‌ రాందాస్‌           టీఆర్‌ఎస్‌                ప్రతాప్‌రెడ్డి          టీఆర్‌ఎస్‌               

నార్సింగి సంజీవరెడ్డి       కాంగ్రెస్‌                    సత్యనారాయణ     బీజేపీ      

బండ్లగూడ పెంటారెడ్డి        టీఆర్‌ఎస్‌                తిరుపతిరెడ్డి         టీఆర్‌ఎస్‌

రాయదుర్గం అరవిందరెడ్డి     టీఆర్‌ఎస్‌                నర్సింహా            టీఆర్‌ఎస్‌            

ఆమనగల్లు వెంకటేష్‌         టీఆర్‌ఎస్‌                సత్యనారాయణ    టీఆర్‌ఎస్‌

మంచాల పుల్లారెడ్డి          టీఆర్‌ఎస్‌               యాదయ్య         టీఆర్‌ఎస్‌

మాడ్గుల                   తిరుమల్‌రెడ్డి     టీఆర్‌ఎస్‌                    బలరాం             టీఆర్‌ఎస్‌

తలకొండపల్లి                   కేశవరెడ్డి          ఏఐబీఏఫ్‌                 రవికుమార్‌         ఏఐబీఏఫ్‌     

మహేశ్వరం                   పాండు            టీఆర్‌ఎస్‌                  వెంకటేశ్వర్‌రెడ్డి      టీఆర్‌ఎస్‌

శంషాబాద్‌                   మల్లారెడ్డి          టీఆర్‌ఎస్‌                జ్ఞానేశ్వర్‌             టీఆర్‌ఎస్‌         

కందుకూరు చంద్రశేఖర్‌రెడ్డి   టీఆర్‌ఎస్‌                  విజేందర్‌రెడ్డి         టీఆర్‌ఎస్‌

పాల్మాకుల శ్రావణ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌                  చంద్రశేఖర్‌రెడ్డి      టీఆర్‌ఎస్‌      

మేకగూడ మంజులారెడ్డి    టీఆర్‌ఎస్‌                శ్రీనివాస్‌రెడ్డి        టీఆర్‌ఎస్‌

నందిగామ రాజగోపాల్‌      కాంగ్రెస్‌                  రజినీకాంత్‌         కాంగ్రెస్‌            

కొత్తపేట జగదీష్‌గౌడ్‌      టీఆర్‌ఎస్‌            అంజిరెడ్డి            టీఆర్‌ఎస్‌               

చేగూర్‌ ఆశోక్‌             టీఆర్‌ఎస్‌             పద్మారావు           టీఆర్‌ఎస్‌                

కొందుర్గు దామోదర్‌రెడ్డి     టీఆర్‌ఎస్‌            శ్రీనివాస్‌రెడ్డి         టీఆర్‌ఎస్‌          

షాద్‌నగర్‌ బక్కన్నయాదవ్‌  టీఆర్‌ఎస్‌          పాండురంగారెడ్డి    టీఆర్‌ఎస్‌                     

శంకర్‌పల్లి శశిధర్‌రెడ్డి         టీఆర్‌ఎస్‌             సంజీవరెడ్డి           టీఆర్‌ఎస్‌    

మోకిల గోపాల్‌             కాంగ్రెస్‌                    రవి                   కాంగ్రెస్‌    

షాబాద్‌ చల్లా శేఖర్‌రెడ్డి    టీఆర్‌ఎస్‌              మద్దూరు మల్లేశ్‌    టీఆర్‌ఎస్‌

సురంగల్‌ చంద్రారెడ్డి         కాంగ్రెస్‌                 మహేందర్‌          బీజేపీ    

ఆలూరు కృష్ణారెడ్డి          టీఆర్‌ఎస్‌              కృష్ణయ్య            టీఆర్‌ఎస్‌       

చేవెళ్ల వెంకట్‌రెడ్డి        కాంగ్రెస్‌                వెంకటేశం          కాంగ్రెస్‌