గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 16, 2020 , 23:50:31

తెలంగాణ కల్పతరువు సీఎం కేసీఆర్‌

తెలంగాణ కల్పతరువు  సీఎం కేసీఆర్‌

తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు, ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు.

  • ఒక్కో చిత్రం చూస్తుంటే.. ఉద్యమం రోజులు గుర్తుకువస్తున్నాయి
  • రాష్ర్టానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి
  • ప్రతి ఒక్కరూ ఒక మొక్కనాటి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపాలి
  • ఆర్ట్‌ గ్యాలరీలో కేసీఆర్‌ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

కొండాపూర్‌ : తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు, ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకుని పలువురు చిత్రకారులు వేసిన పెయింటింగ్స్‌ ప్రదర్శన ప్రారంభోత్సవానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అలుపెరుగని ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను తమ అద్భుత పాలనతో అభివృద్ధి, సంక్షేమంలో నంబర్‌వన్‌గా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని రాష్ట్రమంతటా పండుగలా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పుట్టిన రోజు కానుకగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి బహుమతిగా అందించాలన్నారు. ‘ఈచ్‌ వన్‌ ప్లాంట్‌ వన్‌'తో ఆకుపచ్చదనం వృద్ధికి సహకరించాలన్నారు. 


ఉద్యమ సమయం నాటి నుంచి నేటి వరకు వివిధ సంఘటనలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రాలను అద్భుతంగా వేసిన చిత్రకారులను అభినందించారు. ఒక్కో చిత్రాన్ని చూస్తుంటే ఉద్యమ సమయం నాటి రోజులు గుర్తొస్తున్నట్లు తెలిపారు. ఉద్యమం, రాష్ట్ర అభివృద్ధి, ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలను చిత్రాల రూపంలో అందంగా వేయగల్గిన శక్తి, సామర్ధ్యాలు చిత్రకారులకే సొంతమన్నారు. అనంతరం చిత్ర ప్రదర్శనలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ చిత్రాలను టీఎస్‌టీఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాకేశ్‌, ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మి, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ రమణారెడ్డి, ఉద్యమకారుడు, సీనియర్‌ నాయకుడు కృశాంక్‌రెడ్డిలతో కలిసి తిలకించారు. వివిధ కళాకారులు వేసిన పెయింటింగ్‌లలో నుంచి రమణారెడ్డి క్యూరేట్‌ చేయబడిన 50 చిత్రాలను ప్రదర్శనలో ఉంచడం జరిగిందన్నారు. కాగా చిత్ర ప్రదర్శన సోమవారం కూడా కొనసాగుతుందన్నారు.


logo