బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 15, 2020 , 23:51:18

సహకార పోలింగ్‌ ప్రశాంతం

సహకార పోలింగ్‌ ప్రశాంతం
  • జిల్లాలో 83.23 శాతం పోలింగ్‌ నమోదు
  • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌
  • జిల్లావ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకున్న 58,126 మంది రైతులు
  • అత్యల్పంగా శంకర్‌పల్లిలో 72.41 శాతం
  • అత్యధికంగా మోకిలలో 95.37 శాతం..

సహకార సంఘాల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 36 సొసైటీల పరిధిలో 373 వార్డులకు శనివారం ఎన్నికలు జరిగాయి.  హ్నం ఒంటి  వరకే సమయం  ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు భారీ  నిర్వహించారు.


రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 36 సొసైటీల్లో 373 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 69,840 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 58,126 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో సరాసరిగా 83.23 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా మోకిల సొసైటీలో 95.37 శాతం,  అత్యల్పంగా శంకర్‌పల్లి సొసైటీలో 72.41 శాతం పోలింగ్‌ నమోదైంది. 

ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. నిర్ణీత సమయంలో లైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. 37 సొసైటీల పరిధిలో 481 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. 99 డైరెక్టర్‌ స్థానాలు.. ఒక చైర్మన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 9 డైరెక్టర్‌ స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన 36 ప్రాథమిక సహకార సంఘాల పరిధిలోని 373 డైరెక్టర్‌ స్థానాలకు 835 మంది బరిలో నిలిచారు. పోలింగ్‌ ముగిసే సమయానికి ఒంటి గంట వరకు 83.23 శాతం నమోదైంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్‌, కలెక్టరేట్‌ నుంచి ఎన్నికల సరళి, ఫలితాలను ఆర్డీవోలు, తహసీల్దార్లతో పర్యవేక్షించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. 58,126 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్‌ ముగిసే సమయానికి 83.23 శాతం నమోదైంది. 

తరలివచ్చిన ఓటర్లు 

సహకార ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు పట్నం నుంచి పల్లెబాట పట్టారు. జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌ కందుకూరు డివిజన్‌లోని ఆయా మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. అభ్యర్థుల చొరవతో శుక్రవారం రాత్రికే కొందరు గ్రామానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడ కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన 100 మీటర్లను దాటి రావడంతో హెచ్చరికలు జారీ చేశారు. పోలింగ్‌ జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలుచేశారు. 

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత 

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని సమస్యాత్మక కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎన్నికల అధికారులు, పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు. 

అత్యధికం.. అత్యల్పం.. పోలింగ్‌ శాతం..

సహకార ఎన్నికల్లో జిల్లాలో ఆయా ప్రాంతాల్లో అత్యధికం.. అత్యల్పంగా పోలింగ్‌ శాతం నమోదైంది. మొదటి స్థానంలో మోకిల 324 మంది ఓటర్లుండగా 309 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 95.37 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా శంకర్‌పల్లి సొసైటీలో 3153 మంది రైతులు ఉండగా.. 2283 మంది రైతులు ఓటు హక్కు వినియోగించుకుని 72.41 శాతం నమోదైంది.

సహకరించిన అందరికీ కృతజ్ఞతలు : కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ 

జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వీటిని సమర్ధవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఓటర్లు, ఆయా పార్టీల ప్రతినిధులు, పోలీస్‌ సిబ్బందికి, అందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


logo