బుధవారం 01 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 15, 2020 , 23:50:00

సహకార ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు

సహకార ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు
  • షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి
  • గెలుపొందిన టీఆర్‌ఎస్‌ డైరెక్టర్లతో విజయోత్సవ ర్యాలీ, సంబురాల్లో జడ్పీటీసీ, నాయకులు

షాబాద్‌, నమస్తే తెలంగాణ: సహకార ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతయ్యిం దని షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. శనివారం సహకార ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపొందిన డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలతో కలిసి విజయోత్స వ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దివంగత నేత రాజేందర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. పహిల్వాన్‌షావలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు పన్ని నా చివరికి రైతులంతా టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారన్నారు. రైతుల సంక్షేమమే ధ్యే యంగా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. సహ కార సంఘాల ద్వారా రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు.


ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తున్నదన్నారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సహకారంతో షాబాద్‌ మండలానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నక్క శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ చైర్మన్‌ శేరిగూడెం వెంకటయ్య, మండల రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌రావు, శ్రీరాంరెడ్డి, నాయకులు ఎంఏ మతిన్‌, చల్లా శేఖర్‌రెడ్డి, ఈదుల నర్సింలుగౌడ్‌, జీవన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మండల నాయకులు నర్సింహారెడ్డి, వెంకట్‌యాదవ్‌, సత్యం, తొంట వెంకటయ్య, ముఖ్రంఖాన్‌, వైఎస్‌ ఎంపీపీ లక్ష్మి, రాజేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>