శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 15, 2020 , 23:42:39

వయోవృద్ధ ఆశ్రమాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిందే

వయోవృద్ధ ఆశ్రమాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిందే
  • జిల్లా సంక్షేమ అధికారి మోతీ

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ప్రస్తుతం మనుగడలో వృద్ధాశ్రమాలు.. కొత్తగా ఏర్పాటు చేయదలిచిన గృహాలను వయో వృద్ధుల సంక్షేమ శాఖ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆ శాఖ జిల్లా సంక్షేమ అధికారి మోతీ ఒక ప్రకటనలో తెలిపారు. వాటిని సంబంధిత జిల్లా సంక్షేమ శాఖ అధికారుల వద్ద రిజిష్టర్‌ చేయించాలని, లేకుంటే ఆశ్రమాలను మూసివేయడంతో పాటు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8341243650 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.logo