బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 14, 2020 , 23:50:16

పట్టణాభివృద్ధిపై నజర్‌

పట్టణాభివృద్ధిపై నజర్‌
  • కనీస సౌకర్యాలపై దిశానిర్ధేశం
  • నేటి నుంచి నాలుగైదు రోజుల్లో వార్డు కమిటీల ఏర్పాటు
  • త్వరలోనే పట్టణ ప్రగతి

    (రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ) : పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు నూతన పురపాలక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. జిల్లాలోని మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలోని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళికలు చేయడం జరిగింది. ఆ పనులు కొనసాగుతున్నాయి. నగరాలు,పట్టణాలు సుందరంగా తీర్చిదిద్దేందుకు ,అన్నిహంగులు కల్పించేలా ప్రభుత్వం సైతం మున్సిపాలిటీల వారీగా నిధులను మంజూరు చేస్త్తుంది. ఈ పనులు కొలికి వస్తుండగా మిగతా పనులు పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అంతర్గత రహదారులు అవసరం,పారిశుధ్యం మరింత,మెరుగు పర్చేందుకు కృషి చేయనున్నారు. మార్కెట్ల నిర్మాణాలు పూర్తి చేయాలని,మహిళల కోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. మొక్కల పెంపకం,నిధుల కేటాయింపుతో ప్రగతి పరుగులు తీయనుంది. 

‘పట్టణ ప్రగతి’ 

    ఎన్నికైన ప్రజాప్రతినిధులు భాగస్వాములు చేస్తూ..అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఆ మేరకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పల్లె ప్రగతి తరహలోనే పట్టణాల్లో ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించారు. నేటి నుంచి నాలుగైదు రోజుల్లో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు అందాయి. వా ర్డు కమిటీల ఏర్పాటులో రాజకీయాలు చేయొద్దని..పట్టణ ప్రగతిని విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టనున్నారు. పట్టణ ప్రగతికోసం కొనుగోలు చేసే వాహనాలకు స్టిక్కరింగ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.


21 రోజుల్లో ఇండ్లకు అనుమతులు

   టీఎస్‌ బీ పాస్‌పై అధికారులు అవగాహన పెంచుకోవాలి.మున్సిపల్‌ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. పని చేయని ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉండనున్నారు. రూపాయి లంచం లేకుండా 21 రోజుల్లో ఇండ్లకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.అనుమతి ఇవ్వకపోతే అందుకుగల కారణం సూచించాలని అధికారులు ప్రభుత్వం స్పష్టం చేసింది. 


logo