శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 14, 2020 , 23:43:53

సేంద్రియ సాగుకు ‘ఉపాధి’ అనుసంధానం చేయాలి

సేంద్రియ సాగుకు ‘ఉపాధి’ అనుసంధానం చేయాలి
  • సోలార్‌ పెన్సింగ్‌ను ప్రభుత్వం సబ్సిడీపై అందజేయాలి
  • ప్రెసిషన్‌ అగ్రికల్చర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ టీం సభ్యుడికి ఎతుబార్‌పల్లి రైతుల విజ్ఞప్తి
  • యాంత్రీకరణ వ్యవసాయాన్ని ప్రభుత్వం పోత్సహించాలి

మొయినాబాద్‌: సేంద్రియ వ్యవసాయానికి జాతీయ ఉపా ధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, యాంత్రీకరణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, పందుల బెడద నుంచి పంటలను రక్షించుకోడానికి సబ్సిడీపై సోలార్‌ పెన్సింగ్‌ను అందజేయాలని కోరుతూ ఎతుబార్‌పల్లి రైతులు, వ్యవసాయ అధికారుల బృందానికి విజ్ఞప్తి చేశా రు. భువనేశ్వర్‌కు చెందిన ప్రెసిషన్‌ అగ్రికల్చర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంటు సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమయ్యింది. దీంతో సంస్థ అగ్రినామిస్ట్‌ టీమ్‌ సభ్యుడు శ్రీనివాస్‌ శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి, మం డల వ్యవసాయ అధికారి రాగమ్మతో కలిసి మండలంలోని ఎత్‌బార్‌పల్లిని సందర్శించారు. గ్రామంలోని రైతులతో క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులు వేసిన పంటలను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ పొలాల్లోనే రైతులతో సమావేశమై పంటలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుం చి రైతులకు వస్తున్న వ్యవసాయానికి సంబంధించిన వివి ధ అంశాల సమాచారం, వ్యవసాయం గురించి రైతులతో చర్చించారు. సులభతరంగా వ్యవసాయ సమాచారం రైతులకు అందేలా ఎలాంటి చర్యలు చేపట్టాలి, రైతులకు ఎ లాంటి అవసరాలున్నాయి, ప్రభుత్వం రైతుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే పలు అంశాల గురించి చర్చించారు. ప్రభుత్వాలు అందిస్తున్న వ్యవసాయ సమాచారం ఏవిధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి సమాచారం అదనంగా అందించాలి అని రైతులను అడిగి టీం సభ్యుడు తెలుసుకున్నాడు. వ్యవసాయానికి సంబంధించిన సూచనలు, సలహాల కోసం కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే ఎలాంటి స్పందన రైతులకు అందుతున్నది. వారు ఇచ్చే సమాచారంతో రైతులు సంతృప్తి చెందుతున్నారా? ఎ లాంటి సమాచారం కావాలని రైతుల అభిప్రాయాలు తెలసుకున్నారు. పంటలు సాగు చేసిన తరువాత పంట దశను బట్టి ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడాలని ఫోన్‌లకు వ్యవసాయానికి సం బంధించిన సమాచారం వస్తుంది, కాని కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసినప్పుడు మాకు కావాల్సిన సమాచారం అందించడంలేదని చెప్పారు.


సేంద్రియ వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని రైతులు సూచించారు. పంటలు సాగు చేస్తున్న పందుల బెడద ఎక్కువగా ఉందని వాటి నుంచి పంటలను కాపాడుకోవడానికి సబ్సిడీపై సోలార్‌ పెన్సింగ్‌, జాలీలు ఇవ్వాలని రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు. పంటలు పండించడానికి, పండించిన తరువాత కోయడానికి కూలీల కొరత చాలా ఉందని అందుకు గాను యాం త్రీకరణ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జిల్లాలోని రైతులు పంటలు సాగు చేయడానికి సాగు నీటి ప్రాజెక్టులు లేవని, భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పంటలకు కూడా సరిగ్గా బోర్ల ద్వారా నీళ్లు అందడం లేదని రైతులు చెప్పారు. మొయినాబాద్‌ మండలంలో జీవో 111 పరిధిలో ఉందని, పంటలు పండించాలన్న రసాయన ఎరువులు వాడకూడదని నిబంధనలు ఉన్నాయని, పంటలు కాకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోదనే ఆంక్షలు ఉన్నాయని రైతులు చెప్పారు. జీవో 111 పరిధిలో ఉన్న రైతులు పంటలు సాగు చేసుకోవడానికి ప్రత్యేక రాయితీలు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పంటలు ఏ మార్కెట్‌లో అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయో, అలాంటి మార్కెట్‌ సమాచారం కూడా అందజేయాలని రైతులు కోరారు. వారితో పాటు సర్పంచ్‌ నవనీత, వ్యవసాయ విస్తరణ అధికారి కుమార్‌, రైతులు రమాదేవి, నీలకంఠం, పద్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.


logo