మంగళవారం 31 మార్చి 2020
Rangareddy - Feb 13, 2020 , 23:32:57

పల్లె ప్రగతితో ఎంతో అభివృద్ధి

పల్లె ప్రగతితో ఎంతో అభివృద్ధి
  • వన నర్సరీతో గ్రామాల్లో మొక్కలు పెంచే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
  • మంచాలలో పర్యటించిన జాతీయ స్థాయి మానిటరింగ్‌ బృందం సభ్యులు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరు బాగుంది

మంచాల:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయని జాతీయ స్థాయి మానిటరింగ్‌ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, సుబ్బయ్య, ప్రసన్న అన్నారు. మంచాల మండల పరిధిలోని తాళ్లపల్లిగూడ, తిప్పాయిగూడ, చీదేడు గ్రామాల్లో అధికారులతో కలిసి పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను వారు పరిశీలించారు. చీదేడు గ్రామంలో పర్యటించి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల వివరాలు, గ్రామంలో జరిగిన అభివృద్ధి తదితర వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు.  అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వన నర్సరీలో హరితహరం మొక్కలు పెంపకం పద్ధతులు బాగుందన్నారు. అనంతరం తిప్పాయిగూడలో చేపడుతున్న  వర్మీ కంపోస్టుయార్డు పనులను పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం అమలు తీరు అందులో ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారని వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారని సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. తాళ్లపల్లిగూడలో చేపడుతున్న ఫారంఫండ్‌, గొర్రెల షెడ్డు నిర్మాణాలను పరిశీలించారు.


మహిళా సంఘాల పొదుపు, ఆసరా పథకం ద్వారా ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంఫూర్ణ పారిశుద్ధ్యం, గ్రామంలో ప్రతి ఇంటికి నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ పథకాలతో పాటు గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ బృందం సభ్యులు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా మార్చుకోవడంలో గ్రామస్తుల కృషి అభినందనీయం అన్నారు. గ్రామంలో రోడ్డ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవడంతో గ్రామాల్లో చక్కని వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున్నాయని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మర్రి నిత్య, ఎంపీటీసీ నర్సింగ్‌ అనిత, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏపీవో వీరాంజనేయులు, ఏపీఎం శోభ, సర్పంచ్‌లు రమాకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శివరాల పాండు. గ్రామస్తులు  పాల్గొన్నారు. 


logo
>>>>>>