బుధవారం 01 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 13, 2020 , 23:30:54

ఆలయాల అభివృద్ధికి కృషి

 ఆలయాల అభివృద్ధికి కృషి

 పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీలో పరిధిలోని ఆలయాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చెవుల స్వప్న అన్నారు. గురువారం మర్రిపల్లిలోని ఎస్సీ కాలనీలో పోచమ్మగుడి నిర్మాణానికి స్థానిక కౌన్సిలర్‌ పాశం అర్చనతో కలిసి భూమిపూజ  నిర్వహించారు. మున్సిపాలిటీలో అన్నివర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలతో పాటు అత్యవసరం చేపట్టే పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఇటీవల  ప్రమాదవశాత్తు మృతిచెందిన కుంట్లూర్‌ వాసి జోర్క సుధాకర్‌ముదిరాజ్‌ కుటుంబ సభ్యులకు, పసుమాములకు చెందిన సున్నిళ్ల వెంకటేశ్‌ముదిరాజ్‌ కుటుంబ సభ్యులకు పసుమాముల మత్స్య పారిశ్రామిక తరపున కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిన రూ.2 లక్షల రూపాయల చెక్కును, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పాశం దామోదర్‌, రాష్ట్ర మత్య్సశాఖ పారిశ్రామిక సంఘం జిల్లా అధికారులు సుకీర్తి,  శ్రీనివాస్‌, చంద్రం, సంఘం అధ్యక్షుడు జోర్క శ్రీరాములు, సున్నిళ్ల శ్రీనివాస్‌, నగేశ్‌, వీరయ్య, లక్ష్మన్‌, దయాకర్‌, విక్రమ్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.


logo
>>>>>>