గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 11, 2020 , 01:15:55

56, 288 ఇంగ్లిష్‌ డిక్షనరీలు పంపిణీ

56, 288 ఇంగ్లిష్‌ డిక్షనరీలు పంపిణీ
  • విద్యాశాఖ పిలుపుతో ముందుకొచ్చిన పలువురు దాతలు
  • విజయవంతంగా అందజేసిన విద్యాశాఖ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లోని 56,288 మంది విద్యార్థులకు దాతల సహకారంతో డిక్షనరీలు అందజేశారు.  ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ బి. జనార్దన్‌రెడ్డి, డీఈవో వెంకటనర్సమ్మలు గన్‌ఫౌండ్రీలోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో ఆంగ్లపదకోశాలను పంపిణీ చేశారు.


ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలు పెంపొందించేందుకు జిల్లా విద్యాశాఖ వినూత్న మార్గాన్ని ఎంచుకుని అమలు చేస్తున్నది. దీంట్లో భాగంగా విద్యార్థులకు ఆంగ్ల పదకోశాలను (డిక్షనరీ) అందజేస్తున్నది. దాతల నుంచి సేకరించిన ఈ డిక్షనరీల పంపిణీ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా పూర్తయ్యింది. ఇటీవలే విద్యాశాఖ కార్యదర్శి డా. బి.జనార్దన్‌రెడ్డి, డీఈవో వెంకటనర్సమ్మలు గన్‌ఫౌండ్రీలోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో ఆంగ్లపదకోశాలను పంపిణీచేశారు. క్రమంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు.జిల్లాలో మొత్తం 689 పాఠశాలలుండగా,79 పాఠశాలల్లో ప్రత్యేకంగా ఆంగ్లమాధ్యమాన్ని, 159 పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లం, 1 పాఠశాలలో తెలుగు, ఆంగ్లం, మరాఠి, 41 పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ, 60పాఠశాలల్లో ఆంగ్లం, ఉర్దూ, మరో రెండు పాఠశాల్లో బహుళమాధ్యమంలో విద్యాబోధన కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లోనే బహుళమాధ్యమంలో విద్యాబోధన కొనసాగుతుంది. కానీ విద్యార్థుల స్థాయి, సామర్థ్యాలు మెరుగుపడటంలేదు. కాగా జిల్లా విద్యాశాఖ పిలుపుతో జిల్లాలో చాలా మంది ముందుకొచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. 


తమ వంతుగా ఎంత వీలైతే అంత అన్నట్లుగా డిక్షనరీల కోసం విరాళాలు అందజేశారు.పదకోశాలు అందుకున్న ఉన్నత పాఠశాలల వారీగా, విద్యార్థులు సంఖ్య ఈవిధంగా ఉంది. అమీర్‌పేట ,1,09 3,బహద్దూర్‌పుర5,229,బండ్లగూడ3,703,చార్మినార్‌ 3, 068,గోల్కొండ8,491,హిమాయత్‌నగర్‌ 3,696,ఖైరతాబాద్‌,7,882,మారేడ్‌పల్లి3,963,ముషీరాబాద్‌ 1,939, నాంపల్లి2,314,సైదాబాద్‌ 2,532, సికింద్రాబాద్‌ 2,967 మంది విద్యార్థులతో పాటు మరో 9,411 మంది ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు సైతం ఆంగ్ల పదకోశాలను అందజేశారు. మొత్తంగా జిల్లాలో 56,288 మందికి ఆంగ్ల పదకోశాలు పంపిణీచేశారు.


దాతలు వీరే

యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌  : 29,000

ప్రాజెక్ట్‌ 511( వీరేశం)           : 1,500

శ్యామ్‌వీరా                         : 1,000

శైలేంద్రకుమార్‌                    : 1,800

వీటితో పాటు మరికొంత మంది సైతం తమ వంతుగా డిక్షనరీలను సమకూర్చారు. ఇలా తలా ఒక చేయి వేయగా మొత్తంగా 22,988 డిక్షనరీలు సమకూరాయి.


logo
>>>>>>