శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 10, 2020 , T00:50

కాళేశ్వరం అత్యద్భుతం ..

కాళేశ్వరం అత్యద్భుతం ..

ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని మెచ్చుకున్న జిల్లా అధికారులు రెండోరోజు రంగనాయక, కొమటిబండ ప్రాజెక్ట్‌లు, కాల్వల సందర్శన

షాబాద్‌, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా ఉందని జిల్లా అధికారుల బృందం తెలిపారు. సుమారు 30లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కింద నిర్మించిన కాల్వ లు, రిజర్వాయర్‌లను జిల్లా అధికారుల బృందం ఆదివారం పరిశీలించారు. జిల్లా అధికారుల కాళేశ్వరం ప్రాజెక్టు రెండురోజుల అధ్యయనయాత్రకు వెళ్లిన సం గతి విధితమే. అధ్యయనయాత్రలో రెండో రోజైన ఆదివారం వేములవాడ రాజరాజేశ్వర ఆలయం దర్శనం అనంతరం రంగనాయక్‌సాగర్‌ ప్రాజెక్టు, కోమటిబండ ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు నీటి పారుదలశాఖ కార్యాలయం లో కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను అక్కడి అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జిల్లా అధికారులకు వివరించారు. దాదాపు రూ.80వేల కోట్ల ప్రాథమిక అంచనాతో చేపట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18లక్షలకు పైగా పెద్ద ఆయకట్టు అభివృద్ధి, మరో 18లక్షల ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణ చేపట్టడం జరిగిందని చెప్పారు. దీంతోపాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు, పరిశ్రమల అవసరాలకు మరో 30 టీఎంసీల నీటిని అందించేలా ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగిందన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన 13 జిల్లాలకు తాగు, సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రంగనాయక్‌సాగర్‌ ప్రాజెక్టు వద్ద 9:30 మీటర్ల వ్యాసార్థంతో దాదాపు 9 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న భూగర్భ జలాలను చూసి అధికారులు ఆశ్చర్యవంతులయ్యారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తితో ఇక్కడి నుంచి నల్గొండ జిల్లా చిట్యాల వరకు సాగు నీరందించేందుకు వీలవుతుందని అధికారులు వివరించారు. రెండు రోజుల్లో ఆధునిక ఇంజినీరింగ్‌ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు స్వయంగా చూసి ఆనందపడ్డామని జిల్లా అధికారులు పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు బాగుంది

రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రపంచంలోనే ఒక గొప్ప నేతగా నిలిచారు. ప్రాజెక్టును పరిశీలించడం సంతోషంగా ఉంది. 

- పరమేశ్వర్‌రెడ్డి, జిల్లా గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు


రాష్ట్రం అన్నపూర్ణగా మారుతుంది

కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం అన్నపూర్ణగా మారుతుంది. ఈ ప్రాజెక్టు రాష్ర్టానికి గొప్ప వరం లాంటింది. ఈ ప్రాజెక్టు సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆర్థికంగా బాగా ఉన్న ప్రతి ఉద్యోగి కనీసం లక్ష రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి స్వచ్ఛందంగా అందించాలి. 

- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి


అద్భుతమైన ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమై న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయంతో పాటు వా టి అనుబంధ రంగాలు పర్యాటక పరంగా అభివృద్ధి పొందడంతో పాటు జల క్రీడలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయి. 

- వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడలు, యువజన సంక్షేమశాఖ అధికారి


logo