సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Feb 10, 2020 , T00:40

కనులపండువగా బాలయేసు మహోత్సవం

కనులపండువగా బాలయేసు మహోత్సవం
  • ప్రత్యేక ప్రార్థనలు చేసిన పాస్టర్లు
  • రెండు తెలుగు రాష్ర్టాల నుంచి భారీగా భక్తుల రాక
  • బాలయేసు తేరు ప్రదక్షిణకు ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు

హయత్‌నగర్‌: తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ కమ్మగూడ పరిధి లోని బాలయేసు పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం నిర్వహించిన బాలయేసు మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్య లో క్రిస్టియన్లు ఉత్సవాలకు హాజరయ్యారు. క్రిస్టియన్లు కుటుంబ సభ్యులతో సహా ఉత్సవాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నా రు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన సౌకర్యాలతో బాలయేసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే ప్రారంభమైన దివ్య బలిపూజలతో చర్చి పరిసరాలు భక్తి పార వశ్యంతో పులకించాయి. బాలయేసును దర్శించుకునేందుకు భక్తు లు పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రానికి తరలి రావడంతో చర్చి పరిసరాలు సందడిగా మారాయి.

పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారీగా తరలి వచ్చిన ప్రజలు బాలయేసును దర్శించుకొని తరించారు. ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ బోయిగూడ చర్చి నుంచి బాలయేసు తేరు ప్రదక్షిణ భారీ ఊరేగింపుగా సాగింది. కమ్మగూడ బాలయేసు పుణ్యక్షేత్రం వరకు దారి పొడువునా తేరు ప్రదక్షిణకు కౌన్సిలర్‌ కొశిక ఐలయ్య, భక్తులు బ్రహ్మరథం పట్టారు. భక్తుల రాక కోసం నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సౌకర్యం కల్పించింది.  ఈ నెల 16న ఉదయం నిర్వహించే దివ్య బలిపూజ అనంతరం పతాకాన్ని కిందికి దించడంతో ఉత్సవాలు ముగుయనున్నాయి.