శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 10, 2020 , T00:35

సహకార ఎన్నికల్లో 184నామినేషన్లు తిరస్కరణ

సహకార ఎన్నికల్లో 184నామినేషన్లు తిరస్కరణ
  • మొత్తం చెల్లుబాటైనవి 1435
  • జిల్లావ్యాప్తంగా 37 సహకార సంఘాల్లో 481 డైరెక్టర్‌ స్థానాలు
  • నేడు నామినేషన్ల ఉపసంహరణ

షాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో సహకార ఎన్నికల్లో 184నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆదివారం జిల్లావ్యాప్తంగా సహకార సంఘాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. మొత్తం 37 సహకార సంఘాల్లో 481 డైరెక్టర్‌ స్థానాలకుగాను 1619మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో వివిధ కారణాలతో 184మంది నామినేషన్లు తిరస్కరించినట్లు జిల్లా కో-ఆపరేటీవ్‌శాఖ అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. మిగుతా 1435నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని చెప్పారు. సోమవారం 10న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.


logo