సోమవారం 06 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 09, 2020 , 23:43:28

ఆధ్యాత్మికతతోనే ప్రశాంత జీవితం

ఆధ్యాత్మికతతోనే ప్రశాంత జీవితం
  • శంకరాచార్య హంపి నిరూపాక్షి విద్యారణ్య పీఠాధీశ్వరులు
  • విద్యారణ్య భారతీస్వామి
  • నాగలింగేశ్వరస్వామి దేవాలయంలో వార్షికోత్సవం

మొయినాబాద్‌ : ఆధ్మాత్మిక భావనతోనే మనిషికి మానసిక ప్రశాంతత నెలకొంటుందని  శంకరాచార్య హంపి నిరూపాక్షి విద్యారణ్య పీఠాధీశ్వరులు విద్యారణ్య భారతీస్వామి అన్నారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలో ఉన్న నాగలింగేశ్వరస్వామి (శివ), పంచయాతన ఆంజనేయ దేవాలయం చతుర్థి వార్షికోత్సవం  నిర్వహించారు. ఆదివారం దేవతలపూజ, గణపతిహోమం, నవగ్రహ హోమం, రుద్రహోమం, బలిప్రధానం, పూర్ణాహుతి, హారతి, అభిషేకం, మహా మంగళహారతి, మంత్ర పుష్పం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు వార్షికోత్సవ పూజలో పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఆయన వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధితో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పారు. ప్రతి మనిషిలో ఆధ్యాత్మితిక చింతన ఉన్నప్పుడే ఆలోచన శక్తి పెరుగుతుందని అన్నారు. ఆధ్యాత్మిక భావనతో మనిషిలో మార్పు వచ్చి సన్మార్గంలో నడుచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సన్మార్గంలో నడిచినప్పుడు మనిషి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయ నిర్మాణదాత చమన్‌లాల్‌ దేవ్‌, సీఐ జానయ్య, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, మాజీ ఎంపీటీసీ మోహన్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ రాజేశ్‌గౌడ్‌, ఎంపీటీసీలు పట్లో పద్మమ్మ, రితీశ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు జయవంత్‌, షాబాద్‌ దర్శన్‌, మోత్కుపల్లి రాములు, గాండ్ల రాము, మాణెయ్య, మహేశ్‌గౌడ్‌, సురేందర్‌గౌడ్‌, రితీశ్‌రెడ్డి, కేబుల్‌ రాజు, గడ్డం వెంకట్‌రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.


logo