ఆదివారం 24 మే 2020
Rangareddy - Feb 08, 2020 , 01:20:24

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు..

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు..

వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించిన మంత్రి సబితారెడ్డి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించిన మంత్రి సబితారెడ్డి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు సమాయత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి పటోళ్ల సబితారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై వివిధ జిల్లాల కలెక్టర్లతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్చి 4న ప్రారంభమయ్యే పరీక్షల కోసం అధికారులంతా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, థియరీ పరీక్షలను సైతం సాఫీగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు బాధ్యతవహించి సంబంధితశాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత లేకుండా చూడాలని, పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరీశ్‌, జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి తదితరులు మంత్రిని కలిశారు. అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.  

 ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు సమాయత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి పటోళ్ల సబితారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై వివిధ జిల్లాల కలెక్టర్లతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్చి 4న ప్రారంభమయ్యే పరీక్షల కోసం అధికారులంతా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, థియరీ పరీక్షలను సైతం సాఫీగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు బాధ్యతవహించి సంబంధితశాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత లేకుండా చూడాలని, పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరీశ్‌, జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి తదితరులు మంత్రిని కలిశారు. అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. logo