బుధవారం 01 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 07, 2020 , 01:14:55

సత్తా చాటిన బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

సత్తా చాటిన బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

సైదాబాద్ (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో ముంభైలో రెండు రోజుల పాటు సైలో-2020 బొంబాయి రౌండ్ టెబుల్ 19- సైలెంట్ ఒలింపియాడ్ స్పోర్ట్స్ మీట్‌లో మలక్‌పేట ఆస్మాన్‌గడ్ ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్ధులు నేషనల్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ సాధించి సత్తాను చాటారు. ఫ్రిబవరి 3, 4 తేదిల్లో జరిగిన సైలో-2020 బొంబాయి రౌండ్ టెబుల్ 19- సైలెంట్ ఒలింపియాడ్ స్పోర్ట్స్ మీట్‌లో వివిధ అంశాల్లో  ప్రతిభ కనబర్చి 9 బంగారు, 8 వెండి, 6 కాంస్యంతో కలిపి 22 పతకాలను సాధించి ఛాంపియన్ షిప్ ట్రోఫి కైవసం చేసుకున్నారు. ఒలింపియాడ్ స్పోర్ట్స్ పోటీల్లో విజయ ఢంకా మోగించి 22 పతకాలతోపాటు ఛాంపింయన్ ట్రోఫీతో గురువారం నగరానికి తిరిగి వచ్చిన సందర్భంగా పాఠశాలలో విద్యార్థులను  ప్రిన్సిపాల్ ఎ.అరుణ అభినం దించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒలింపియాడ్ బధిరుల రౌండ్ టెబుల్ స్పోర్ట్స్ మీట్‌లో 18 రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని, ఎనిమిది క్రీడా పోటీల్లో చక్కని ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు.అనేక విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో తమ పాఠశాలకు చెందిన 33 మంది విద్యా ర్థులు పాల్గొని, అందులో సత్తాను చాటి ట్రోఫీ తో పాటు 22 పతకాలను, సర్టిఫికెట్స్ సాధించటం గర్వంగా ఉందన్నారు.   వ్యాయామ ఉపాధ్యాయురాలు శేషరత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>